మన్యం న్యూస్,ఇల్లందు:పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు ఇల్లందు మండలం మసివాగు గ్రామపంచాయతీలోని ఆంజనేయ స్వామి ఆలయ మరమ్మత్తుల కొరకు 25 వేల రూపాయల విరాళాన్ని ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ బుధవారం అందజేశారు. మసివాగు గ్రామానికి చెందిన బిఆర్ఎస్ మండల నాయకులు బోడ రమేష్ కు ఈ విరాళాన్ని ఇల్లందు శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియ నాయక్ అందజేశారు. ఆంజనేయస్వామి ఆలయ మరమ్మతులు చేపించాలని అడిగిన వెంటనే స్పందించి విరాళం అందజేసిన హరిప్రియ దాతృత్వాన్ని గ్రామప్రజలు అభినందించారు