నిషేధిత కలుపుమందును సీజ్ చేసిన అధికారులు
మన్యం న్యూస్ ఇల్లందు:కాన్సర్ కారక కలుపుమందు నిషేధిత గ్లైఫోసైట్ ను పట్టణంలోని పాతబస్టాండ్లో ఉన్న న్యూ అదిత్యసాయి పెర్టిలైజర్ షాప్ నందు అమ్మకాలు జరుగుతున్నాయనే సమాచారంతో మంగళవారం ఇల్లందు ఎడిఏ వాసవిరాణీ, ఏడిఏ టెక్నికల్ ఆఫీసర్ మదన్ లాల్ సంయుక్తంగా రైడ్ చేసి పట్టుకున్నారు. ఐదువందల లీటర్ల గ్లైఫోసైట్ ను అధికారులు సీజ్ చేయటం జరిగింది. షాప్ యజమాని కాటేపల్లి నవీన్ పై చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.