మన్యం న్యూస్ చండ్రుగొండ, ఆగస్టు 31: అన్న, చెల్లెల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ ఈ పండుగ కోసం చెల్లెల్లు ఏడాదిగా ఎదురు చూడటం, రాఖీ పండుగకు పుట్టింటికి రావడం సంతోషంగా అన్నలకు రాఖీలు కట్టడం జరుగుతుంది. గురువారం మండల వ్యాప్తంగా రాఖీ పండుగను అన్నా చెల్లెలు ఘనంగా జరుపుకున్నారు. రాఖీలు కట్టిన చెల్లికి తనను తోచిన రీతిలో సాంప్రదాయబద్ధంగా సంతోష పెట్టి, నూతన వస్త్రాలు పెట్టి సాగనంపారు. పండుగను పురష్కరించుకొని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
