మన్యం న్యూస్,దుమ్ముగూడెం:
మండల పరిధి మహాదేవపురం గ్రామంలో భద్రాచలం నియోజకవర్గం స్థాయి చర్చి పాస్టర్స్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ , భద్రాచలం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తెల్లం వెంకట్రావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా చర్చి పాస్టర్స్ ఐక్యవేదిక సభ్యులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ కి తమ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. భద్రాచలం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ తెల్లంను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ఏకగ్రీవ తీర్మానం చేశారు. దుమ్ముగూడెం మండలం అధ్యక్షులు అన్నే సత్యనారాయణ, ఎంపీపీ రేసు లక్ష్మి , జెడ్పీటీసీ తెల్లం సీతమ్మ తదితరులు పాల్గొన్నారు.
