మన్యం న్యూస్ గుండాల: బీఆర్ఎస్ పార్టీ పినపాక నియోజకవర్గఅభ్యర్థి, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా గుండాల మండలంలో పర్యటించి పలు కుటుంబాలను పరామర్శించారు. జగ్గయ్య గూడెం గ్రామానికి చెందిన వట్టం నరేష్ రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో అతని నివాసానికి వెళ్లి పరామర్శించారు. అదే గ్రామంలో మొల్కం సమ్మయ్య మృతి చెందడంతో వారి నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం గుండాల మండల కేంద్రంలో బత్తిని శ్రీను అనారోగ్యంతో మృతి చెందడంతో వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.