- నరేంద్ర మోడీతో పరీక్ష పే చర్చ కు చర్ల ఏకలవ్య స్కూల్ విద్యార్థి ఎంపిక
- హర్షం వ్యక్తం చేస్తున్న ఆర్ సి ఓ, ప్రిన్సిపాల్ శకుంతల
మన్యం న్యూస్ చర్ల:
ఢిల్లీలో జరగబోయే పరీక్ష పే చర్చ కార్యక్రమానికి
చర్ల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ కు చెందిన పి.శ్రీజ 9వ తరగతి చదువుతున్న విద్యార్థి ఎంపిక అవడం జరిగింది. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ తో పరీక్ష పే చర్చ కార్యక్రమం చర్ల స్కూలుకు చెందిన విద్యార్థిని పాల్గొనడం ఎంతో హర్షణీయం. తెలంగాణ రాష్ట్రo లో ఉన్న 23 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ నుండి పది మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ 10 మంది లో చర్ల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థి ఉండటం పట్ల పాఠశాల ప్రిన్సిపాల్ శకుంతల హర్షం వ్యక్తం చేస్తూ చేశారు. ఈ కార్యక్రమంలో ఈ ఎం ఆర్ ఎస్ సెక్రటరీ నవీన్ నికోలస్, డిప్యూటీ సెక్రటరీ చంద్రశేఖర్ ,ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆర్ సి ఓ వెంకటేశ్వర రాజు , వైస్ ప్రిన్సిపాల్ జ్యోతి అభినందించడం జరిగింది.