ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా తెరకెక్కించిన ‘హనుమాన్’ మూవీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ.231 కోట్ల కలెక్షన్స్ వసూళ్లు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇదే హవా కొనసాగితే ఈ వీకెండ్‌కు రూ.250 కోట్ల మార్క్‌ను దాటే అవకాశమున్నట్లు అంచనా వేస్తున్నాయి.