రవితేజ హీరోగా డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ‘ఈగల్’ మూవీ ఈనెల 9న విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. తాజాగా ఈ సినిమా సక్సెస్ వేడుకలను ‘మిస్టర్ బచ్చన్’ బృందం సెలబ్రేట్ చేసుకుంది. దర్శకుడు హరీష్ శంకర్‌తో రవితేజ మిస్టర్ బచ్చన్ అనే మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ షూటింగ్ సెట్లోనే మేకర్స్ రవితేజతో ‘ఈగల్’ సక్సెస్ వేడుకలను చేశారు.