మన్యం న్యూస్, అశ్వారావుపేట, మార్చి, 01: అశ్వారావుపేట మండలం, అశ్వారావుపేట లోని స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు శుక్రవారం మండల టాస్క్ ఫోర్స్ మీటింగ్ లో ముక్య అతిథిగా అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు పల్స్ పోలియో చుక్కలు వేపించుకోవలని మండల ప్రజలను కోరారు. మండలంలో మొత్తం 54 కేంద్రాల ద్వారా 5 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలు 6090 మంది ఉన్నారని వీరికి 03 తేదీ ఆదివారం నుండి మూడు రోజుల పాటు ఈ పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అని ఆయన తెలిపారు. ఈ పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని మొదటి రోజు బూత్ లెవెల్ లో నిర్వహిస్తారని, తరువాత రెండు రోజులు ఇంటింటి సర్వే చేస్తూ పిల్లలకు ఈ పోలియో చుక్కలు వేస్తారని, కావున మండల ప్రజలు అందరూ ఈ పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని విజయవంతం చేసి పోలియో రహిత దేశంగా గా మార్చడానికి సహకరించాలని ఆయన మండల ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, ఎంపిడివో శ్రీనివాస రావు, తహసీల్దార్ కృష్ణ ప్రసాద్, డాక్టర్స్ రాందాస్, మధులిక, సీడీపీఓ రోజా రాణి, సెర్ఫ్ డిపార్ట్ మెంట్ సత్తిబాబు, సూపర్ వైజర్ విజయ లక్ష్మి, కరెంట్ ఎఈ తదితరులు పాల్గొన్నారు.