మన్యం న్యూస్, మంగపేట.
వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో మహబూబాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ములుగు జిల్లా మంగపేట మండలం కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ అధ్యక్షులు పల్లి కొండ యాదగిరి అన్నారు.
గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మా ట్లాడుతు కేంద్రములో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అటవీ హక్కుల చట్టం ఆహార భద్రత ఉపాధి హామీ సమాచా ర హక్కు విద్య హక్కు చట్టా లు తిసుకచ్చిన ఘనత కాం గ్రెస్ పార్టీది పేదలకు ఏడు విడుతలుగా భూపంపిణీ ఇప్పుడు ఉన్న మోడీ ప్రభు త్వం కార్మిక,రైతు వ్యతిరేక నల్లా చట్టాలను తీసుకువచ్చి కార్పొరేట్ కంపెనీల కు రెడ్ కార్పెట్ వేసి వాళ్ళ అప్పులు మాఫీ చేసిందని ప్రతి ఒక్క కుటుంబములో 15 లక్షల రూ పాయలు వేస్తానని మోసం చేసిన నీచమైన చరిత్ర బిజెపి పార్టీదని ఉద్యోగాలు కల్పిం చకుండా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి పేదల నడ్డి విరిచిన బిజెపికి రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ మహబూబాబా ద్ పార్లమెంట్ అభ్యర్థి బలరాం నాయక్ భారీ మెజార్టీతో గెలి పించాలని ఎస్సి సెల్ మండల అధ్యక్షులు యాదగిరి అన్నారు.