సిద్ధార్థ్ మల్హోత్ర – రాశీఖన్నా కలిసి నటించిన ‘యోధ’ మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. అందులో వీళ్లిద్దరి కెమిస్ట్రీ మాత్రం తీవ్ర చర్చనీయాంశమైంది. తాజాగా దీనిపై రాశీ స్పందించారు. ‘‘నాది అందరితో త్వరగా కలిసిపోయే మనస్తత్వం కాదు. సిద్ధార్థ్ కూడా అలానే ఉంటారు. మేమిద్దరం ప్రాణ స్నేహితులం కాము. అవసరం ఉంటేనే మాట్లాడుకుంటాం. ‘యోధ’లో కథ అవసరం మేరకు నటించాం. మేము మా హద్దులు ఎప్పుడూ దాటలేదు.’’ అని చెప్పారు.