UPDATES  

 రఘురామను ఈనెల 26న విచారణ… 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు

తమది కాని చోట అధికులం అనరాదు అన్నది ఒక సామెత ఉంది. కానీ కొందరుంటారు.. కెలికీ మరీ తమ ప్రాపకం కోసం హంగామా చేస్తుంటారు. వైసీపీ తరుఫున నర్సాపురం ఎంపీగా గెలిచి సొంత పార్టీనే ధిక్కరించి.. జగన్ ను ముప్పుతిప్పలు పెట్టిన వైసీపీ ఎంపీ రఘురామ ఇప్పుడు జగన్ సర్కార్ అరెస్ట్ చేసి నాలుగు తగిలించాక హైదరాబాద్, ఢిల్లీకే పరిమితం అయ్యారు. బీజేపీ పెద్దల ప్రాపకం కోసం పలు పార్టీలు ఇస్తూతన ఎంపీ సీటు పోకుండా లాబీయింగ్ చేస్తున్నాడు. అయితే వైసీపీ ప్రభుత్వం, జగన్ పై రోజూ ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించడం మాత్రం మానడం లేదు. నిత్యం న్యూస్ చానెల్స్ లైవ్ ఇచ్చే ఈ వైసీపీ రెబల్ ఎంపీ ఆశ్చర్యకరంగా తెలంగాణ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇరుక్కోవడమే చర్చనీయాంశమైంది. తాజాగా తెలంగాణ సిట్ పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చేదాకా ఈ మహానుభావుడు అందులో ఉన్నాడన్న విషయం ఎవరికీ తెలియదు. అనూహ్యంగా తెలంగాణ పోలీసులు రఘురామకు నోటీసులు ఇచ్చే సరికి అందరూ అవాక్కయ్యారు. తెలంగాణ ఎమ్మెల్యేలను కొనుగోలు కోసం వచ్చిన ముగ్గురు నిందితులతో ఎంపీ రఘురామ కాంటాక్ట్ అయ్యారని.. వారితో కలిసి మతలబు చేశారని తేలిందట..

అందుకే సన్నిహిత సంబంధాలున్న రఘురామను ఈనెల 26న విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆయనకు 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు పంపారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కేసులో ఆ ముగ్గురు నిందితులతో రఘురామకు సంబంధాలు ఉండడం వల్లే విచారణకు పిలిచినట్టు సమాచారం. రఘురామ పార్టీలకు అతీతంగా స్నేహం కొనసాగిస్తుంటారు. నిందితులైన రామచంద్రభారతి, నందకుమార్ తోనూ రఘురామకు సంబంధాలున్నాయట.. దీంతో నోటీసులు జారీ చేశారు. అయితే ఎవరు నోటీసులు ఇచ్చినా.. ఏ కేసు అయినా హైకోర్టు, సుప్రీంకోర్టుకు ఎక్కి స్టే తెచ్చుకోవడం రఘురామకు అలవాటు. మరి అదే పనిచేస్తారా? లేక నోటీసులు ఇచ్చిన తెలంగాణ పోలీసుల ఎదుట హాజరవుతారా? చూడాలి. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ను కేసీఆర్ సర్కార్ వదలడం లేదు. మరి నిందితులకు సహకరించిన ఎంపీ రఘురామను వదిలే ముచ్చటే లేదు. సో ఈ కేసులో ఎంత పెద్ద తలకాయలు ఉన్నా వదలొద్దని కేసీఆర్ సీరియస్ గా చెప్పేశారట.. ఫాఫం రఘురామ పరిస్థితి ఏమవుతుందో.. ఎరక్కపోయి ఆ నిందితులతో సంబంధాలు పెట్టుకొని ఇప్పుడు ఇరుక్కుపోయాడని కథలు కథలుగా చెప్పుకుంటున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !