UPDATES  

 సమంత ‘యశోద’ వివాదం

ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘యశోద’ సినిమాకి తొలి రోజు మంచి టాక్ వచ్చింది.. సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది కూడా. బ్రేక్ ఈవెన్ దాటి సినిమా లాభాల బాట పట్టినట్లు ట్రేడ్ నిపుణులు ఇప్పటికే తేల్చేశారు. డిసెంబర్ 19న ఓటీటీలోకి ‘యశోద’ రానుండగా, ఓ ఆసుపత్రి యాజమాన్యం సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కోర్టునాశ్రయించింది, ఓటీటీ రిలీజ్‌ని అడ్డుకునేందుకు ప్రయత్నిచింది. ‘ఇవా’ పేరుతోనే అసలు సమస్య.. సినిమాలో ‘ఇవా’ పేరుతో ఓ ఆసుపత్రి, అందులో సరోగసీ వ్యవహారాలు.. ఇదంతా నడుస్తుంటుంది.

అయితే, ఆ ‘ఇవా’ పేరున్న ఓ ఆసుపత్రి హైద్రాబాద్‌లో అభ్యంతరాలు వ్యక్తం చేసింది, కోర్టును ఆశ్రయించి.. ‘ఓటీటీ’ రిలీజ్‌పై స్టే తెచ్చుకుంది. ఇక, ఈ వివాదంపై చిత్ర నిర్మాతలు స్పందించారు. సదరు ఆసుపత్రి యాజమాన్యంతో చర్చించారు. సమస్య పరిష్కారమయ్యిందనీ, సినిమాలో ఇవా అనే పేరుని మ్యూట్ చేయడంతో పాటు, అది కనిపించే సన్నివేశాల్లో బ్లర్ చేస్తామనీ, సాంకేతికంగా దీన్ని సరిదిద్దేందుకు వారం రోజుల సమయం పడుతుందని నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ వెల్లడించారు. సమస్య పరిష్కారానికై సహకరించిన ఇవా హాస్పిటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు నిర్మాత. ఓటీటీలో ఎప్పుడు వచ్చేది వచ్చే నెలలో ప్రకటిస్తామని నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ ప్రకటించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !