పుష్ప టీమ్ రష్యాలో సందడి చేసింది. డిసెంబర్ 8న భారీ స్థాయిలో పుష్ప రష్యన్ డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ కానుంది. దీంతో పుష్ప బృందం రష్యాలో ప్రమోషన్స్ మొదలుపెట్టారు. హీరో అల్లు అర్జున్, రష్మిక మందన్న, దర్శకుడు సుకుమార్ నిర్మాతలలో ఒకరైన రవిశంకర్ రష్యా ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. పుష్ప కోసం తాను ఎంత కష్టపడ్డాడో అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు. ఇక డిసెంబర్ 1న అలాగే 3న సెయింట్ పీటర్స్ బర్గ్ లో ప్రత్యేక ప్రీమియర్ లు ఏర్పాటు చేయనున్నారు.
పుష్ప టీమ్ తో అభిమానులు కలిసి సినిమా చూసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ ప్రెస్ మీట్ లో బన్నీ.. రష్యన్ లాంగ్వేజ్ లో మాట్లాడడం ఆశ్చర్యానికి గురిచేసింది. పుష్పలోని ఫేమస్ డైలాగ్స్ ను బన్నీ రష్యన్ లాంగ్వేజ్ లో చెప్పి షాక్ ఇచ్చాడు. రష్యా వారికి పుష్ప సినిమా నచ్చుతుందని, ప్రపంచంలో తనకు నచ్చిన ప్లేస్ రష్యా అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఇండియాను షేక్ ఆడించిన ఈ సినిమా రష్యాలో ఎలాంటి విజయాన్ని అందుకోనున్నదో చూడాలి.