UPDATES  

NEWS

జక్కన్న స్కెచ్… క్షమాపణలు చెప్పే కుటుంబం కాదు నాది : రాహుల్‌ గాంధీ.. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు.. నిర్వహణ ఏర్పాట్లపై ఈ నెల 28వ తేదీన మాక్ డ్రిల్.. హ్యాట్రిక్ పక్కా …..మళ్ళీ కేసీఆర్ సర్కారే… నేషనల్ పంచాయితీ అవార్డు అందుకున్న కాకర్ల గ్రామపంచాయతీ.సర్పంచ్, కార్యదర్శికి పురస్కారాన్ని అందించిన కలెక్టర్ అనుదీప్… ఇల్లందులో మెనూ పాటించని పోస్ట్ మెట్రిక్ వసతిగృహాన్ని పరిశీలించిన ఏటీడీఓ..మెనూ పాటించే విధంగా చర్యలు చేపట్టాలని విద్యార్థి సంఘాల డిమాండ్.. శ్రీరామున్నే మభ్యపెట్టిన ఘనత కేసిఆర్….. సంతలకు తెలంగాణ వ్యాపారాలు రావద్దు..  అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటను పరిశీలించిన ఎమ్మెల్యే రాములు నాయక్.ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులకు హామీ.. మణుగూరు ఏరియాలో పర్యటించిన సింగరేణి ప్రాజెక్ట్,ప్లానింగ్ డైరెక్టర్ జి. వేంకటేశ్వర రెడ్డి..

 HANSIKA – పెళ్లి ఫొటోలు వైరల్‌

కథానాయిక హన్సిక కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. ప్రియుడు సొహైల్ కతురియాతో ఏడడుగులు వేసింది. ఆదివారం జైపూర్‌లోని ముందోతా ఫోర్ట్ ప్యాలెస్‌లో హన్సిక, సొహైల్ పెళ్లి వైభవంగా జరిగింది.పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పెళ్తిదుస్తుల్లో హన్సిక మెరిసిపోతూ కనిపించింది. హన్సిక, సొహైల్ పెళ్లికి కుటుంబసభ్యులు, సన్నిహితులతో పాటు కొద్ది మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లికి ముందు నుంచే చాలా కాలంగా సొహైల్‌తో హన్సికకు పరిచయం ఉంది. రెండేళ్లుగా హన్సిక అతడితో ప్రేమలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇన్నాళ్లు ప్రేమ విషయాన్ని రహస్యంగా దాచిన హన్సిక ఇటీవలే సొహైల్‌కు ఈఫిల్ టవర్ ముందు లవ్‌ను ప్రపోజ్ చేసిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

త్వరలోనే అతడిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. హన్సికకు ఇది మొదటి వివాహం కాగా సొహైల్‌కు మాత్రం ఇది రెండోది. గతంలో హన్సిక స్నేహితురాలు రింకీ బజాజ్‌ను సొహైల్ పెళ్లిచేసుకున్నారు. మనస్ఫర్థలతో ఆమె నుంచి విడాకులు తీసుకున్నాడు. సొహైల్‌, రింకీ బజాజ్ పెళ్లికి హన్సిక హాజరైన పాత వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అల్లు అర్జున్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన దేశముదురు సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది హన్సిక. కందిరీగ, బిల్లా, దేనికైనా రెడీతో పాటు పలు తెలుగు సినిమాల్లో గ్లామర్ ప్రధాన పాత్రల్లో నటించింది. తమిళంతో అగ్ర హీరోయిన్లలో ఒకరిగా పేరుతెచ్చుకున్నది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో ఆరు సినిమాలు చేస్తోంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !