UPDATES  

NEWS

వినాయక మండపాల విద్యుత్ చార్జీలురూ.50వేలు చెల్లించిన ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పోలింగ్ స్టేషన్లు ఓటర్ లందరికీ సదుపాయకరంగా ఉండాలి : భద్రాచలం ఆర్డీవో మంగీలాల్ విగ్నేశ్వరుడి దయ అందరిపై ఉండాలి * ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ ప్రజాపంథా పార్టీ డివిజన్ కార్యదర్శి కొండా చరణ్ అరెస్ట్ క్రీడా ప్రాంగణం స్థలం కబ్జా ఆదివాసీల స్వయంపాలన ఏర్పాటు కోసం అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలి. జీఎంని కలిసిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నూతన కార్యవర్గం అసంగటిత కార్మికుల పక్షాన పోరాడిన యోధుడు, కా,, ముక్తార్ పాషా. కాంట్రాక్టు కార్మికులకు సింగరేణి ఎన్నికల్లో ఓటుహక్కు కల్పించాలి అన్ని దానాల కన్న అన్నదానం గొప్పది

 CRAZY కాంబినేషన్‌.. విజయ్‌, లోకేశ్ కనగరాజ్‌ మూవీ

తమిళ సూపర్‌ స్టార్ దళపతి విజయ్‌, మాస్టర్‌, విక్రమ్‌ మూవీల ఫేమ్‌ లోకేశ్‌ కనగరాజ్‌ క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ దళపతి67. విజయ్‌ 67వ మూవీ ఇది. ఇదొక గ్యాంగ్‌స్టార్‌ థ్రిల్లర్‌ మూవీ. ఈ సినిమా సోమవారం (డిసెంబర్‌ 5) పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. అయితే ఈ సినిమాను అధికారికంగా ఇంకా అనౌన్స్‌ చేయాల్సి ఉంది. సౌత్‌ ఇండస్ట్రీలో దళపతి 67 మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను ఇంకా అధికారికంగా ప్రకటించక ముందే ఫ్యాన్స్‌లో విపరీతమైన హైప్‌ క్రియేట్ చేసింది. ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఈ సినిమా కొత్త రికార్డులను బ్రేక్‌ చేసింది. ఇప్పటికే రూ.500 కోట్ల బిజినెస్‌ చేయడం విశేషం. ఇక ఈ సినిమా షూటింగ్‌ జనవరిలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. విజయ్‌ నటించిన వారసుడు మూవీ సంక్రాంతికి రిలీజ్‌ కానున్న విషయం తెలిసిందే.

ఆ సినిమా తర్వాత విజయ్‌ నటిస్తున్న మూవీ ఇదే. ఇప్పటికే లోకేశ్‌ తన స్క్రిప్ట్‌ను పూర్తి చేశాడు. ప్రీప్రొడక్షన్‌ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ సినిమాలో ఎక్కువ భాగం షూటింగ్‌ కశ్మీర్‌లోనే జరగనుంది. నిజానికి మొదట ఈ సినిమాను మున్నార్‌లో తీయాలని అనుకున్నా.. ఇప్పుడు కశ్మీర్‌కు లొకేషన్‌ను మార్చినట్లు ఈ మూవీ వర్గాలు వెల్లడించాయి. జనవరిలోనూ మొదటి షెడ్యూల్‌ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. దళపతి67లో విజయ్‌ ఓ గ్యాంగ్‌స్టార్‌ రోల్‌లో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ విలన్‌గా కనిపించనున్నట్లు సమాచారం. అంతేకాదు సినిమాలో తమిళ, మలయాళ, హిందీ ఇండస్ట్రీలకు చెందిన భారీ తారాగణం నటించనుందనీ వార్తలు వస్తున్నాయి. దళపతి67లో త్రిష ఫిమేల్‌ లీడ్‌లో కనిపించనుందనీ తెలుస్తోంది. మాస్టర్‌, విక్రమ్‌లను మించిన స్థాయిలో దళపతి 67ను నిర్మించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !