UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 సమంత యశోద ఈ ఏడాది టాలీవుడ్‌లో హయ్యస్ట్ కలెక్షన్స్

సమంత యశోద ఈ ఏడాది టాలీవుడ్‌లో హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన లేడీ ఓరియెంటెడ్ సినిమాగా నిలిచింది. ఓవరాల్‌గా భాగమతి తర్వాత తెలుగులో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన లేడీ ఓరియెంటెడ్ సినిమా ఇదే కావడం గమనార్హం. మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ సినిమాకు హరీ హరీష్ దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 11న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా 37 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కాబోతున్నట్లు తెలిసింది. డిసెంబర్ 9 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో (Amazon Prime)ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. మంగళవారం లేదా బుధవారం ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ను రివీల్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సినిమా మొత్తం ఈవా అనే సరోగసీ సెంటర్ బ్యాక్‌డ్రాప్‌లో నడుస్తోంది. అదే పేరుతో హైదరాబాద్‌లో ఓ హాస్పిటల్ ఉండటం వివాదానికి దారితీసింది. ఆ హాస్పిటల్ బృందం కేసు పెట్టడంతో ఓటీటీ రిలీజ్‌కు అడ్డంకులు ఏర్పడ్డాయి.

అందుకే రీలీజ్ డేట్‌ను ఇప్పటివరకు రివీల్ చేయలేదు. ఇటీవలే ఆ అడ్డంకులు క్లియర్ కావడంతో డిసెంబర్ 9న ఈ సినిమాను ఓటీటీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలిసింది. యశోద కథేమిటంటే… ఇందులో యశోద అనే సాధారణ యువతి పాత్రలో సమంత నటించింది. కనిపించకుండా పోయిన తన చెల్లెలిని వెతుక్కుంటూ ఆమె సాగించే జర్నీని డైరెక్టర్ థ్రిల్లింగ్‌గా ఆవిష్కరించారు. బ్యూటీ ప్రోడక్ట్స్‌లో బేబీ ఫీటస్ ఉపయోగిస్తూ అంతర్జాతీయ స్థాయిలో నేరాలకు పాల్పడుతోన్న కొందరు క్రిమినల్స్‌ను తన ధైర్యసాహసాలతో యశోద ఎలా పట్టుకుందన్నదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్స్‌లో కనిపించారు. హరీ, హరీష్‌లకు తెలుగులో ఇదే తొలి సినిమా. యశోద సినిమాను శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు. యశోద సినిమాను సీక్వెల్ తెరకెక్కబోతున్నట్లు సమాచారం.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !