UPDATES  

NEWS

కొంటె దివి… ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ ఫెస్టివల్… ఏడుమ్యాచ్ లు ఇక్కడే ఫిక్స్… పది గంటలు ఉత్కంఠ.. నేడు మళ్ళీ కవిత విచారణ.. తెలంగాణలోకి బిజెపి ప్రవేశిస్తే ప్రమాదమే.. గిరిజనేతరుల సమస్యలు పరిష్కరించాలని ఎంఆర్ఓ, ఎంపిడిఓ లకు వినతి పత్రం.. మండల కేంద్రానికి సెంట్రల్ లైటింగ్ కొరకురూ 5 కోట్లు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కలెక్టర్ అనుదీప్ .  హర్షం వ్యక్తం చేసిన ఎంపీటీసీ ఐలూరి కృష్ణారెడ్డి .. లైబ్రరీ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి: టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు రంగనాథ్.. శ్రీరామనవమి ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించాలి.. గుంపెన సొసైటీ ఆద్వర్యంలో మహాజనసభ :పిఎసిఎస్ అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు .. రివ్యూ మీటింగ్ లతో ఒరిగేదేమీ లేదు  – ఎమ్మెల్యే పొదెం వీరయ్య

 KEERTHY SURESH కంబ్యాక్. ఒకేసారి రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్

కీర్తి సురేష్ అనే పేరు వినగానే అందరికీ ‘మహానటి’ సినిమా గుర్తొస్తుంది. ‘మహానటి సావిత్రి’ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్ అద్భుతంగా నటించింది.

అప్పటివరకూ మాములుగా ఉన్న కీర్తి సురేష్ కెరీర్ ని టర్న్ చేసిన ‘మహానటి’ సినిమా కీర్తిపై ప్రేక్షకుల్లో అంచనాలని పెంచింది. ఈ సినిమా తర్వాత కీర్తి సురేష్ నుంచి ఆడియన్స్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయడం మొదలుపెట్టారు. ఆ అంచనాలని అందుకోవడంలో కీర్తి సురేష్ ఫెయిల్ అయ్యింది, బ్యాక్ టు బ్యాక్ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది కానీ ఒక్క హిట్ కూడా ఇవ్వలేకపోయింది. దీంతో ‘మహానటి’తో కీర్తి సురేష్ కెరీర్ అయిపోయినట్లే, ఇక ఆమె హిట్ ట్రాక్ ఎక్కడం కష్టమని అందరూ అనుకున్నారు. ఇదే టైంలో లావు తగ్గి, కీర్తి సురేష్ ఫేస్ లో కళ పోగొట్టుకుంది. ‘సావిత్రి’గా నటించి మెప్పించిన అమ్మాయి ఇలా అయిపోయిందేంటి అని జాలి పడిన వాళ్లు కూడా ఉన్నారు.

బ్యాక్ టు బ్యాక్ పది ఫ్లాప్స్ ఇచ్చింది అంటే కీర్తి సురేష్ కెరీర్ ఎంత డౌన్ అయ్యి ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఇక లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో లాభం లేదనే విషయం తెలుసుకున్న కీర్తి సురేష్, హీరోల పక్కన నటించడం మొదలుపెట్టింది. ఈ కోవలోనే వచ్చిన ‘సర్కారు వారి పాట’ సినిమాలో మహేశ్ పక్కన నటించి లీర్తి సురేష్ మంచి కంబ్యాక్ ఇచ్చింది. ఈ మూవీలో కీర్తి తన గ్లామర్ తో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడమే కాకుండా ‘మ.. మ.. మహేషా” సాంగ్ లో డాన్స్ తో కూడా ఆకట్టుకుంది. సర్కారు వారి పాట సినిమా ఇచ్చిన జోష్ లో కీర్తి సురేష్ హిట్ ట్రాక్ ఎక్కింది. ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో నాని హీరోగా నటిస్తున్న ‘దసరా’, చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘భోలా శంకర్'(చిరుకి చెల్లిగా), హోంబలే ప్రొడక్షన్ హౌజ్ నిర్మిస్తున్న ‘రఘు తాత’ సినిమాలు ఉన్నాయి. వీటిలో ‘దసరా’, ‘రఘు తాత’ సినిమాలు పాన్ ప్రాజెక్ట్స్ గా తెరకెక్కుతున్నాయి. రెండు సినిమాల్లో కీర్తి సురేష్ కొత్తగానే కనిపించనుంది కాబట్టి ఆమె గోల్డెన్ పీరియడ్ మళ్లీ స్టార్ట్ అయినట్లే. ఈ సినిమాలు సాలిడ్ హిట్స్ గా నిలిస్తే కీర్తి సురేష్ పాన్ ఇండియా హీరోయిన్ అవ్వడం గ్యారెంటి.

   TOP NEWS  

Share :

Don't Miss this News !