రష్మిక మందన్న గుడ్ బై సినిమా చూడమంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. గుడ్ బై కంటే కాంతార బెటర్ అంటూ విమర్శిస్తున్నారు. కన్నడంలో ఈ ఏడాది బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన కాంతార సినిమాను చూడలేదంటూ ఇటీవలే రష్మిక మందన్న వ్యాఖ్యానించింది. అంతేకాకుండా ఓ ఇంటర్వ్యూలో తనను హీరోయిన్‌గా పరిచయం చేసిన కన్నడ నిర్మాణ సంస్థ పేరును పలకడానికి రష్మిక మందన్న ఇష్టపడలేదు. ఆ బ్యానర్ రిషబ్ శెట్టి సోదరుడు రక్షిత్ శెట్టిది కావడం గమనార్హం. రక్షిత్ శెట్టి దర్శకత్వం వహించిన కన్నడ చిత్రం కిరిక్ పార్టీ సినిమాతోనే రష్మిక మందన్న కథానాయికగా అరంగేట్రం చేసింది. ఈ సినిమా సక్సెస్ కావడంతో తెలుగులో అవకాశాల్ని అందుకున్న ఆమె అనతికాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది.
కానీ తనకు తొలి అవకాశం ఇచ్చిన రక్షిత్ శెట్టి బ్యానర్ పేరును పలకపోవడంతో రష్మికపై గత కొన్నాళ్లుగా కన్నడ ఫ్యాన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన బాలీవుడ్ చిత్రం గుడ్‌బై ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. ఈ సినిమాతోనే రష్మిక బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మీ ఫ్యామిలీతో కలిసి గుడ్‌బై సినిమా చూడలేదా? అయితే ఇప్పుడే చూసేయండి. నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది అంటూ ఇటీవల రష్మిక మందన్న ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ఆమె పోస్ట్‌పై రిషబ్‌శెట్టి ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. గుడ్ బై సినిమా చూడం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరో నెటిజన్ నీ సినిమాను మేము చూడాలని అనుకోవడం లేదు. బాయ్ కాట్ రష్మిక మందన్న అంటూ రిప్లై ఇచ్చాడు. నీ ఫస్ట్ ప్రొడక్షన్ ఏదో గుర్తుందా అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. రష్మిక చేసిన పోస్ట్‌కు ఎక్కువగా నెగెటివ్ కామెంట్స్ రావడం ఆసక్తికరంగా మారింది.