UPDATES  

NEWS

 దేశంలో మార్పు కేసీఆర్ కే సాద్యం భారత రాష్ట్ర సమితికి ప్రైవేటు ఉద్యోగుల సంఘం మద్దతు

మన్యం న్యూస్,హైదరాబాద్:
దేశంలో నెలకొన్న దుర్బర పరిస్థితిలకు కారణమైన బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దింపాలంటే భారత రాష్ట్ర సమితి మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి సాధ్యమని భారత ప్రైవేటు ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గంధం రాములు అన్నారు. మహబూబ్ నగర్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు. దక్షిణ భారతదేశం తెలంగాణ ,ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక ,తమిళనాడు, కేరళ , కు సంబంధించిన ప్రైవేటు ఉద్యోగుల శాఖ అధ్యక్షులు భారత రాష్ట్ర సమితి నూతన పార్టీ కి మద్దతుగా ఉంటామని వినతి పత్రం ఇవ్వడం జరిగినది. ప్రైవేటు ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక సలహాదారులు రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , మరియు రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు అచ్చంపేట శాసనసభ్యులు గువ్వల బాలరాజ్ గారి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ గారిని కలిసి మద్దతు తెలపడం జరిగినది.
దేశంలో రైతు వ్యతిరేక విధానాలకు , ప్రైవేటీకరణకు, నిరుద్యోగులకు రావలసిన 16 కోట్ల ఉద్యోగాలను నింపకపోవడం
ఇండస్ట్రియల్ పాలసీని నిర్వీరం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఉద్యమ నాయకుడు కెసిఆర్ గారి వెంటే ప్రవేటు ఉద్యోగులు మరి కార్మికులు నిరంతరం ఉంటారని కేసిఆర్ చేసే ధర్మపోరాటానికి దేశంలో ఉన్న ప్రైవేటు ఉద్యోగులు కార్మికులు సంఘీభావంగా కలిసి వస్తారని ఆశాభావం వ్యక్తపరిచారు.
ఈ కార్యక్రమంలో గద్వాల శాసనసభ్యులు కృష్ణమోహన్ రెడ్డి నాగర్ కర్నూల్ శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి ,సంఘం నాయకులు కోల శ్రీనివాస్, సోషల్ మీడియా ఇంచార్జ్ మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !