UPDATES  

 ఏబీఎన్ ఆర్కే మళ్లీ ఏశాడు..’ అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్

అది దేశంలోనే అత్యుత్తమ మీటింగ్. జీ20 సదస్సు సందర్భంగా దేశంలోని ముఖ్యమంత్రులు.. వివిధ పార్టీ అధినేతలతో ప్రధాని మోడీ నిర్వహించిన అంతర్గత సమావేశం. ఇందులోకి రిపోర్టర్లు సహా ఎవరికీ అనుమతి లేదు. ఇక మోడీ కేవలం కొద్దిసేపు పలకరింపుగా అటు ఏపీ సీఎం జగన్ తో.. ఇటు టీడీపీ అధినేత చంద్రబాబుతో మాట్లాడారు. కుషల ప్రశ్నలు, పలకరింపులు తప్ప అంతకుమించిన వారి మధ్య ఏం జరగలేదు. కానీ వీరిమధ్య నిలబడి అంతా విన్నట్టు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ తన పత్రికలో రాసుకున్న విధానం చూసి ఇప్పుడు అందరూ నవ్వుకుంటున్నారు.. ‘ఏం సెప్తిరి.. ఏం సెప్తిరి.. ఏబీఎన్ ఆర్కే మళ్లీ ఏశాడు..’ అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఈ వేశాలే తగ్గించుకుంటే మంచిదని హితవు పలుకుతున్నారు.. ప్రతిసారీ ఏబీఎన్ ఆర్కే తనను తాను మేధావిగా అనుకుంటూ రాసే కథనాలు ఆయన ప్రతిష్టను నిజంగానే దిగజార్చుతున్నాయని చెప్పొచ్చు.

ఢిల్లీలో చంద్రబాబు, జగన్ లతో మోడీ మాట్లాడిన మాటలను ఈయన చెవి దగ్గరపెట్టి విన్నట్టు అభూత కల్పనలతో సంబంధం లేని వాటికి అల్లి రాసిన కథనాలు నిజంగానే నవ్వుల పాలయ్యాయి. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ, వేమూరి రాధా కృష్ణ తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి , మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటించారు. ప్రధాని మోడీ నిర్వహించిన మీటింగ్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్కే రాసిన రాతలు చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఆర్కే అంతర్గత నివేదికగా పేర్కొన్నప్పటికీ అస్సలు నిజాలు కానీ వార్తలతో అందరినీ వెర్రిపుష్పాలను చేసేలా రాసేశాడు. జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోడీని లేదా హోంమంత్రి అమిత్ షాను కలిస్తే వారి భేటీకి సంబంధించిన వాస్తవాలను వారిద్దరిలో ఎవరో ఒకరు వెల్లడించాలి.

కానీ ఆశ్చర్యకరంగా రాధాకృష్ణ వారి మధ్య జరిగిన ఒక వివరణాత్మక చర్చను ఈయనే పక్కనుండి విన్నట్టు బయటపెడుతాడు. వారిలో ఎవరైనా అతనికి బ్రీఫ్ చేసినట్లు లేదా అతని రిపోర్టర్ లోపల ఉండి రాసినట్టుగా చెబుతాడు. ఇక ఢిల్లీలో చంద్రబాబు నాయుడు ఈ నేతలను కలిసినప్పుడు కూడా అదే జరిగింది. సోమవారం ఢిల్లీలో నరేంద్ర మోడీతో జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కొద్దిసేపు ముచ్చటించినప్పుడు రాధాకృష్ణ మరోసారి అక్కడ ఏం జరిగిందన్న దానిపై తనదైన మార్క్ కథనం ప్రచురించి బిల్డప్ ఇచ్చేశాడు. వారి మధ్య విడివిడిగా జరిగిన చర్చల గురించి ఆర్కే చాలా ఆసక్తికరమైన కథనాలను అందించారు. షర్మిలను తెలంగాణ పోలీసులు అరెస్టు చేయడంపై జగన్‌ను ప్రధాని అడిగారని ఆర్కే సంబంధం లేని టాపిక్ ను రాసుకొచ్చాడు. జగన్ సోదరిని పోలీసులు భౌతికంగా ఎత్తుకెళ్లిన తీరు చూసి తాను బాధపడ్డానని, దానిపై స్పందించకపోవడాన్ని ప్రశ్నిస్తున్నానని జగన్ కు మోడీ చెప్పాడని ఆర్కే రోతల రాతలు రాశాడు.

అసలు షర్మిల గురించి మోడీకి ఏమైనా ఆలోచన ఉందా? ఆమె గురించి మాట్లాడటం ప్రధానికి అంత ముఖ్యమా అని అందరూ ఆర్కే కథనాలపై ఆశ్చర్యపోతున్నారు. మోడీ, చంద్రబాబుల మధ్య పరస్పర చర్చ గురించి ఆంధ్రజ్యోతి చీఫ్ చాలా ఆసక్తికరమైన కథనాన్ని వండివార్చారు. ఆర్కే ప్రకారం.. చంద్రబాబు ఆరోగ్యంపై ప్రధాని మోడీ చాలా ఆందోళన చెందారట. అందుకే సన్నగా మారారని బాబు బదులిచ్చాడట.. ఇలా చంద్రబాబుకు పాజిటివ్ గా.. బీజేపీతో టీడీపీ బంధం బలపడేలా.. జగన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసేలా రాధాకృష్ణ రాతలున్నాయి.. పదే పదే ఆర్కే తనను తాను ఫూల్స్ చేసుకుంటాడని పలువురు నెటిజన్లు సోషల్ మీడియా సాక్షిగా సెటైర్లు వేస్తున్నారు. ఏం జరిగిందో తెలియకున్నా.. అభూత కల్పనలతో రాస్తూ ఆర్కే ఏ స్థాయికైనా దిగజారగలడని నిరూపించుకున్నాడని సెటైర్లు వేస్తున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !