తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ షర్మిల జోరు పెంచారు. ప్రధాని నరేంద్ర మోడీ నుంచి ఫోన్ వచ్చాక, ఆమె మాటల్లో ‘వాడి, వేడి’ మరింత ఎక్కువగా కనిపిస్తున్నాయ్. ‘శ్రీకాంతాచారికి అగ్గిపెట్టె దొరికింది.. అమరుడయ్యాడు.. ఫాఫం.. హరీష్ రా వుకి అగ్గిపెట్టె దొరకలేదు.. అందుకే మంత్రి అయ్యాడు..’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ షర్మిల. తెలంగాణ ఉద్యమంలో పెట్రోల్, ఉరితాళ్ళు.. చాలామంది ఉద్యమకారుల్ని బలితీసుకున్నాయ్. ఎక్కడన్నా ఉద్యమాల్లో సమిధలయ్యేది సామాన్యులే.. సమైక్య ఉద్యమంలో కూడా ఎంతోమంది అమాయకులు బలయ్యారు.
ఉద్యమాలంటేనే అంత. సామాన్యులు సమిధలైతేనే, రాజకీయ నాయకులు గద్దెనెక్కుతారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విషయంలో కూడా జరిగింది అదే కదా.! కానీ, వైఎస్ షర్మిల ఆ మాట చెప్పలేరు కదా.? ఇక, తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి తెలంగాణను కేసీయార్ తీసేస్తే, వైఎస్సార్ పార్టీలో తెలంగాణ పెట్టింది తానంటూ షర్మిల వ్యాఖ్యానించడం గమనార్హం. షర్మిల మాటలు తూటాల్లా పేలతాయ్ ప్రత్యర్థుల గుండెల్లో. ఇంతకీ, అగ్గిపెట్టె ఆరోపణలపై మంత్రి హరీష్ రావు, వైఎస్ షర్మిల సెటైర్లకు సమాధానం చెబుతారా.? వేచి చూడాల్సిందే.