UPDATES  

 దివాళా అంచున AP GOVERNMENT

ఒక వ్యక్తి వ్యాపార అభివృద్ధి కోసం అప్పులు తీసుకొచ్చి పెట్టుబడిగా పెడితే.. అందులో నష్టాలు మిగిలితే.. తెచ్చిన అప్పు కట్టలేని పరిస్థితి వస్తే… తనను దివాళాదారునిగా ప్రకటించాలని కోర్టును కోరతాడు. కోర్టు కూడా సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఒక ప్రభుత్వం ఆర్బిట్రేషన్ సెంటర్ కు వెళ్లడం ఎప్పుడైనా చూశామా? కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా వేధించడం కన్నామా? కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయంలో అదే జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ పరువు మాటతప్పని, మడమతిప్పని పాలన వల్ల గంగలో కలిసిపోతుంది. JAGAN ఎందుకు ఈ దౌర్భాగ్యం విలువైన వనరులు ఆంధ్రప్రదేశ్ సొంతం. దేశంలోనే గుజరాత్ తర్వాత అత్యంత పొడవైన తీరరేఖ కలిగిన ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో ఉంది. కానీ ఏం సుఖం? ఏం లాభం? పంచుడు కార్యక్రమాలకు అలవాటుపడ్డ ప్రభుత్వం, బటన్ నొక్కేందుకు మాత్రమే పరిమితమైన ముఖ్యమంత్రి, ఆయనకు భజన చేసేందుకు మాత్రమే నియమితులైన మంత్రులు, ప్రభుత్వ ఖజానాను అప్పనంగా దొబ్బి తింటున్న సలహాదారులు.. అంతా కలిసి ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు వివిధ పనులు చేసిన కాంట్రాక్టర్లకు రూపాయి కూడా ఇవ్వలేదు.. దీంతో వారంతా కోర్టులను ఆశ్రయించారు.. కోర్టులు కూడా బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించాయి. కానీ ఖజానాలో రూపాయి లేనప్పుడు ప్రభుత్వం మాత్రం ఏం చేస్తుంది? బిల్లులు చెల్లించలేక రక్తహస్తం చూపిస్తోంది. దీంతో పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు.

పోలవరం నుంచి మారుమూల గ్రామంలో రోడ్డు వరకు ఒక్క పని అంటే ఒక్క పని కూడా చేసేందుకు కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదు. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇలా ఉంటే ఆ ‘నీలి’ మీడియా ఏపీ ప్రజలకు భూతల స్వర్గం చూపిస్తోంది. ఇక ఆ పార్టీ సోషల్ మీడియా అయితే సరే సరి. సర్కారు ఆర్బిట్రేషన్ కు వెళ్లడమా? ఏపీ ప్రభుత్వాన్ని నమ్మి పనులు చేసిన కాంట్రాక్టర్ల బిల్లులు పెద్ద ఎత్తున పెండింగ్ లో ఉన్నాయి. వేచి చూసి చూసి చాలామంది కోర్టులకు వెళ్లారు. కోర్టుల్లో ప్రభుత్వం మోసం చేసిందని, బిల్లులు చెల్లించాలని దాఖలవుతున్న పిటిషన్లు ప్రతిరోజూ వేల సంఖ్యలో ఉంటున్నాయి.. కోర్టు తీర్పు చెప్పినప్పటికీ… ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదు. దీంతో కోర్టు ధిక్కార పిటిషన్లు కూడా వేలల్లో ఉంటున్నాయి.. ఇలాంటి పరిస్థితి మార్చుకునేందుకు ప్రభుత్వం కొత్తగా ఆర్బిట్రేషన్ కు వెళ్లాలని ప్రయత్నిస్తోంది.. మాజీ న్యాయమూర్తులతో ఆర్బిట్రేషన్ పెట్టుకోవాలని చూస్తోంది.. అలా చేస్తే ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు వచ్చే అవకాశాలు ఎక్కువ.. ప్రభుత్వం పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలి. కానీ ఎగ్గొట్టే ప్రయత్నాలు చేస్తుండడం కాంట్రాక్టర్లకు కంట నీరు తెప్పిస్తోంది.. దీనివల్ల ప్రభుత్వంపై కాంట్రాక్టర్లకు నమ్మకం పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.. దీనివల్ల తాను దివాళా తీశానని ప్రభుత్వం పరోక్షంగా అంగీకరించినట్టే అనే భావన కనిపిస్తోంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !