UPDATES  

 ఊర్వశి రౌతెలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్.

మెగాస్టార్ చిరంజీవిని కింగ్ ఆఫ్ డాన్స్ అని ఊరికే అనరు.! ఇండియన్ సినిమాకి సంబంధించి ‘ది బెస్ట్ డాన్సర్స్’ లిస్టు తీస్తే, అందులో మెగాస్టార్ చిరంజీవి అగ్రస్థానంలో వుంటారన్నది చాలామంది కొరియోగ్రాఫర్లు చెప్పే మాట. సరే, ఇప్పుడైతే చిరంజీవి కి వయసైపోయింది.. యంగ్ హీరోలతో పోటీపడి ఎనర్జిటిక్ డాన్సులేయడం ఆయనకు సాధ్యం కాకపోవచ్చు. కానీ, గ్రేస్ విషయంలో ఇప్పటికీ మెగాస్టార్ చిరంజీవితో పోటీ పడటం యంగ్ జనరేషన్ హీరోలకి కష్టమే.! ఊర్వశి రౌతెలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. తాజాగా బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలా ‘వాల్తేరు వీరయ్య’ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవితో కలిసి డాన్సులేసింది.

ఈ స్పెసల్ సాంగ్ కోసం చిరంజీవితో డాన్సులేసే క్రమంలో డాన్స్‌ని ఒకటికి పదిసార్లు ప్రాక్టీస్ చేయాల్సి వచ్చిందట ఊర్వశి రౌతెలాకి. ‘డాన్స్ అంటే చాలామంది చెప్పే నిర్వచనం వేరు. కానీ, మెగాస్టార్ చిరంజీవి గ్రేస్ వేరు. ఆయనతో కలిసి డాన్స్ చేస్తే, డాన్స్ నేర్చుకున్నట్లే వుంటుంది..’ అని ఊర్వశి చెప్పుకొచ్చింది. అంతే కాదు, షూటింగ్ స్పాట్‌లో తాను చేసిన డాన్స్ రిహార్సల్స్ గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తూ వస్తోంది ఊర్వశి. ‘బాస్ పార్టీ’ సాంగ్‌లో చిరంజీవి – ఊర్వశి కలిసి చిందులేసిన సంగతి తెలిసిందే.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !