ఆ అమ్మాయి పేరు తపస్వి. బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ కోర్సు చేస్తోంది. త్వరలో పరీక్షలు వుండడంతో స్నేహితురాలి ఇంటికి వెళ్లిన తేజస్వినిని కాపు కాసి హతమార్చాడు ఓ కసాయి. గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో ఈ ఘోరం చోటు చేసుకుంది. తపస్వి చాలా మంచి అమ్మాయి. ధైర్యవంతురాలు కూడా. గత కొన్నాళ్లుగా ఓ సాప్ట్‌వేర్ కుర్రోడు తేజస్వినిని ప్రేమ, పెళ్లి.. అంటూ వేధింపులకు గురి చేశాడట. ఇన్‌స్టా గ్రామ్ ద్వారా పరిచయమైన ఆ కుర్రోడు, తపస్విని ప్రేమిస్తున్నాననీ, ఎలాగైనా పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి తీసుకొచ్చాడట. స్నేహితురాలి కళ్ల ముందే.. ఈ విషయమై గతంలో ఒకసారి పోలీసుల కు ఫిర్యాదు కూడా చేసింది తపస్వి. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారట.
కొన్నాళ్ల తర్వాత మళ్లీ తన పైశాచికత్వం ప్రదర్శించాడా కసాయి. చివరికి కాపు కాసి, స్నేహితురాలి ఇంట్లో వుండగానే తన కసాయితనం ప్రదర్శించాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకుని, తపస్విపై సర్జికల్ బ్లేడుతో దాడి చేశాడు. అత్యంత కిరాతకంగా గొంతు కోసి హతమార్చాడు. స్నేహితురాలి కళ్ల ముందే తపస్విని కసి తీరా చంపేశాడా మానవ మృగం. భవిష్యత్తు మీద ఎన్నో కలలు కన్న తపస్వి జీవితం మధ్యలోనే ఇలా కడతేరిపోవడం విషాదం. నిందితున్ని కఠినంగా శిక్షించాలంటూ తపస్వి కుటుంబ సభ్యులతో పాటూ, స్థానికులూ కోరుకుంటున్నారు.