UPDATES  

 BRS సంబంధిత దస్త్రాలపై తెలంగాణ CM కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంతకాలు

ఇప్పుడిక అధికారికం.! ఇకపై తెలంగాణ రాష్ట్ర సమితి పేరు భారత్ రాష్ట్ర సమితిగా మారిపోయినట్టే.! ఈ మేరకు సంబంధిత దస్త్రాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంతకాలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పార్టీ పేరు మార్పు విషయమై గ్రీన్ సిగ్నల్ వచ్చిన దరిమిలా, కేసీయార్ తాజాగా తెలంగాణ భవన్‌లో భారత్ రాష్ట్ర సమితి జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర సమితిలోని ‘తెలంగాణ’ తీసేశారు. ‘జై తెలంగాణ’ లోని తెలంగాణ తీసేశారు. భారత్ రాష్ట్ర సమితి.. జై భారత్.. అనే పేర్లు కొత్తగా జెండా మీదకు వచ్చాయి. అదే గులాబీ రంగు జెండా. అయితే, మ్యాప్ మాత్రం తెలంగాణ స్థానంలో ఇండియా మ్యాప్ వచ్చి చేరింది. ఎగిరింది బీఆర్ఎస్ జెండా ఈ బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ హాజరయ్యారు.

ఇప్పటిదాకా ‘జై టీఆర్ఎస్’ నినాదాలు చేస్తూ వచ్చిన గులాబీ శ్రేణులు ‘జై బీఆర్ఎస్’ అంటున్నారు. జై తెలంగాణ నినాదాలతోపాటుగా కొత్తగా జై భారత్ నినాదాలు చేస్తున్నారు. భారత్ రాష్ట్ర సమితి, దేశ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయమని బీఆర్ఎస్ నేతలుగా మారిన టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. కాగా, అసెంబ్లీ స్పీకర్ అలాగే లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్‌లకు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పేరు మార్పు విషయమై బీఆర్ఎస్ అధినేత కేసీయార్ లేఖలు రాయనున్నట్లు తెలుస్తోంది. BRS Leaders Chanting Jai Bharat Slogans తదనంతరం, టీఆర్ఎస్ ప్రజా ప్రతినిథులంతా బీఆర్ఎస్ ప్రజా ప్రతినిథులవుతారు. త్వరలో తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జెండాతోనే గులాబీ అభ్యర్థులు పోటీ చేస్తారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !