ఈ వారం డబుల్ ఎలిమినేషన్ వుంటుందా.? అంటూ సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. ఆ విషయమై కాస్సేపట్లోనే క్లారిటీ వచ్చేయబోతోంది. ప్రస్తుతానికి డేంజర్ జోన్‌లో ఎవరున్నారన్నదానిపై సోషల్ మీడియా వేదికగా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అన్ని అనఫీషియల్ ఓటింగ్స్ ప్రకారం చూస్తే, కీర్తి అలాగే శ్రీసత్య ఈ వారం డేంజర్ జోన్‌లో వున్నట్లు కనిపిస్తోంది. ఈ ఓటింగ్స్ ఎంతవరకు నమ్మదగ్గవి.? అంటే, వీటికి అనుగుణంగానే ఎలిమినేషన్స్ జరుగుతున్నట్లు అర్థమవుతోంది. అయితే, అప్పుడప్పుడూ ఓటింగుకి భిన్నంగా కూడా జరుగుతోంది. \
శ్రీ సత్య, కీర్తి ఔట్ అయితే ఎలా.? శ్రీ సత్య, కీర్తి.. ఇద్దరూ మేనేజిమెంట్ కోటాలో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారన్న ప్రచారం తొలి వారం నుంచీ జరుగుతున్న సంగతి తెలిసిందే. అదే నిజమైతే, ఆ ఇద్దర్నీ సేవ్ చేసి, ఇంకెవర్నో ఈ వారం బలి చేసే అవాకాశాలూ లేకపోలేదు. అలా చూస్తే, రోహిత్ వికెట్ పడిపోవచ్చు. కాగా, మొదటి నుంచీ శ్రీసత్య ఆట తీరు చాలామందికి నచ్చడంలేదు. కీర్తి ఒక్కోసారి బాగానే వుంటున్నా, చాలాసార్లు సింపతీతో నెట్టుకొచ్చేసింది. బిగ్ బాస్ రియల్టీ షో అంటేనే, అదో జడపదార్థం.. ఎవరికీ అర్థం కాదు. అందరూ మేనేజిమెంట్ కోటా కంటెస్టెంట్లే.. ఎవర్ని ఎప్పుడు పీకెయ్యాలంటే అప్పుడు పీకేస్తారన్న వాదనా లేకపోలేదు.