UPDATES  

NEWS

జన చైతన్య యాత్రకు ఘన స్వాగతం… మంచి ఆదరణతో దూసుకుపోతున్న ఆరోగ్య మహిళ పథకం.. సింగరేణిలో 60 లక్షలు విలువ చేసే కేబుల్ చోరీ.. మంచినీటి సమస్యపై ఐటీడీఏ అధికారులు కలిసిన బిజెపి నాయకులు.. విద్యార్థులకు “ఆయుష్ న్యూట్రిషన్ కిట్లు” పంపిణీ చేసిన యునాని డాక్టర్ రాజేంద్ర రావు.. ఇటుకలు మీరు మోస్తున్నారా..?  క్రీడా మైదానం పనులు  ప్రారంభించదానికి ఇంత ఆలస్యం ఏంటి ?  ఐ టి డి ఎ ఇంజనీరింగ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం… మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం… ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్.. మన ఊరి మనబడి బడ్జెట్లో గండి.. కంటి వెలుగు పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి డి ఎం హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య..

 బిగ్ బాస్ తీసుకున్న నిర్ణయానికి ప్రేక్షకులు షాక్

బిగ్ బాస్ తీసుకున్న నిర్ణయానికి ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఎలిమినేషన్ గురించి పెద్ద చర్చ జరుగుతోంది. ప్రస్తుతం బిగ్బాస్ లో ఇనయ ఎలిమినేట్ కాబోతుందని వార్తలు వస్తున్నాయి. అందరూ ఇనయ బిగ్ బాస్ 6 విన్నర్ లేదా రన్నర్ అవుతుందని అనుకున్నారు. అలాంటిది ఇప్పుడు ఆమె బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ కాబోతుందని సమాచారం. అసలు ఈమెను హౌస్ నుంచి పంపించడానికి గల కారణాలు ఏంటి అని అందరు ఆలోచిస్తున్నారు. ఈవారం నామినేషన్ లో రేవంత్ రోహిత్, ఆదిరెడ్డి, శ్రీసత్య, కీర్తి, ఇనయా లు ఉన్నారు.శ్రీహాన్ కు టికెట్ టు ఫినాలే రావడంతో అతడికి నామినేషన్స్ నుంచి మినహాయింపు దొరికింది. అలాగే ఫైనల్ లో నిలిచిన మొదటి కంటెస్టెంట్ గా శ్రీహాన్ నిలిచాడు. అలాగే ఈ సీజన్ స్టార్ట్ అయిన దగ్గర్నుంచి ఒంటరిగా పోరాడుతూ వచ్చింది ఇనయ, హౌస్ లో ప్రతి ఒక్కరికి గట్టి పోటీ ఇచ్చింది. ఇక ఈవారం కూడా ఓటింగ్ లో ఏ పోల్ చూసుకున్న సరే టాప్ 3 లో ఉంది.

అయితే బిగ్బాస్ మాత్రం ఇనయని ఎలిమినేట్ చేస్తారు అనే వార్తలు వస్తున్నాయి. పోల్ లెక్కల ప్రకారం చూస్తే తొలి రెండు ప్లేసుల్లో రేవంత్, రోహిత్ ఉన్నారు. మూడో ప్లేసులో ఇనయ ఉంది. ఆ తర్వాత ఆదిరెడ్డి, శ్రీ సత్య, కీర్తి వరుసగా ఉన్నారు. దీని ప్రకారం చూస్తే కీర్తి ఎలిమినేట్ కావాల్సి ఉంది. Bigg Boss 6 Telugu eliminated Inaya sultana కానీ హౌస్ నుంచి ఆమె కాకుండా ఇనయ వెళ్తుందని టాక్ వస్తుంది. తొలి రెండు వారాలు కాస్త డల్ గా కనిపించిన ఇనయ, ఆ తర్వాత నుంచి ప్రతి టాస్క్ లో బాగా ఆడింది. కొన్నిసార్లు రేవంత్ ను పక్కకినెట్టి ఓటింగ్ విషయంలో కొన్ని వారాలు టాప్ లో నిలిచింది. మిగతా కంటెస్టెంట్స్ గేమ్స్ బాగా ఆడకపోయినా ఓనయ మాత్రం దూకుడుగా గేమ్స్ ఆడింది. అలాంటిది ఇప్పుడు బిగ్బాస్ ఆమెనే ఎలిమినేట్ చేస్తున్నాడు అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ప్రేక్షకుల మాత్రం ఇనయ ఫైనల్ కి చేరుకోవాలని కోరుకుంటున్నారు. ఈ ఎలిమినేషన్ నిజమో కాదో తెలియాలంటే ఈ వీకెండ్ అయిపోయే వరకు వేచి చూడాలి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !