UPDATES  

NEWS

ఘనంగా ముగిసిన శ్రీ నాగులమ్మ తల్లి సుంకు పండగ… ఉపాధి హామీ కూలీలకు దినసరి వేతనం రూ,,272 వచ్చెల చూడాలి…. పని చేసే ప్రభుత్వాన్ని గెలిపించండి… కాంగ్రెస్ మండల ఎస్సి సెల్ అధ్యక్షులు పల్లి కొండ యాదగిరి… వినయ్ కుమార్ రెడ్డి ట్రస్ట్ సేవలు వెలకట్టలేనివి… శీతల చలివేంద్రం ప్రారంభించిన జాతీయ మిర్చి బోర్డు డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి… శ్రీ నాగులమ్మ కు ఆదివాసీ సాంప్రదాయ బద్ధంగా పూజారుల పూజలు..గండోర్రే గుట్ట వద్ద వనదేవతకు ప్రత్యేక పూజలు.. ‘పరిష్కారమెప్పుడూ యుద్ధరంగంలో లభించదు’.. తాజ్‌మహల్‌పై పిటిషన్.. విచారణకు స్వీకరించిన కోర్టు.. పవన్ కల్యాణ్ ప్రచారానికి అనసూయ. హీరో నవీన్ పొలిశెట్టికి యాక్సిడెంట్..! ఓటీటీలోకి సుందరం మాస్టర్..

 టాలీవుడ్ లో మహేష్ ది మిస్టర్ పర్ఫెక్ట్ ఇమేజ్

టాలీవుడ్ లో మహేష్ ది మిస్టర్ పర్ఫెక్ట్ ఇమేజ్ అని చెప్పాలి.. ఏళ్లుగా పరిశ్రమలో ఉంటున్నా మహేష్ పై ఒక్కటంటే ఒక్క వివాదం లేదు. తనపని తాను చూసుకోవడం, అవసరమైనంత వరకే మాట్లాడడం మహేష్ నైజం అని అందరికి తెలిసిందే . ఈ మిస్టర్ పర్ఫెక్ట్… మిస్ పర్ఫెక్ట్ అయిన నమ్రతని భార్యగా తెచ్చుకున్నాడు. మహేష్ ని ప్రేమ వివాహం చేసుకున్న నమ్రత ఉత్తమ ఇల్లాలు గా మారింది. ఇంటి పనులు, బయటి పనులు చూసుకుంటూ ఉత్తమ ఇల్లాలిగా మంచి పేరు తెచ్చుకుంది. 2000 వ సంవత్సరంలో ‘వంశీ’ సినిమా షూటింగ్ టైములో మహేష్, నమ్రత లు కలుసుకోగా, అప్పుడు వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. 2005 లో పెళ్లి చేసుకున్న మహేష్, నమ్రతలకు ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళే గౌతమ్, సితార. సినిమాల్లో రాకముందు.. నమ్రత మోడలింగ్‌లో అడుగుపెట్టింది. అలా 1993లో నమ్రత మిస్ ఇండియా, మిస్ ఏషియా పసిఫిక్‌గా కూడా ఎంపికైంది.

ఆ తర్వాత పలు ఆ తర్వాత పలు హిందీ సినిమాల్లో కూడా నటించింది. 1972 జనవరి 22న మహారాష్ట్ర రాజధాని ముంబైలో జన్మించిన నమ్రత అక్క పేరు శిల్పా శిరోద్కర్ కాగా ఆమె కూడా బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించింది. mahesh babu uncle news viral Mahesh Babu : అంత బ్యాక్‌గ్రౌండ్ ఉందా.. నమ్రత అక్క తెలుగులో మోహన్ బాబు హీరోగా నటించిన ‘బ్రహ్మ’ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటిచింది. ఇక ఈమె నానమ్మ మీనాక్షి శిరోద్కర్ ప్రముఖ మరాఠీ నటి కాగా, 1938లో ‘బ్రహ్మచారి’ సినిమాలో నటించారు.నమ్రత తండ్రి విషయానికి వస్తే ఆయన పేరు నితిన్ శిరోద్కర్. ఈయన అప్పట్లో మంచి క్రికెటర్ గా రాణించారు. ముంబై టీం కి దేశ వాలి ఆటగాడు అయితన ఈయన క్రికెట్ తో మంచి పేరు ని పొందారు. దిలీప్ వెంగాసర్కార్, సునీల్ గవాస్కర్ వంటి పెద్ద ఆటగాళ్ల తో ఈయన క్రికెట్ ఆడేవారని తెలుస్తుంది. క్రికెట్ మంచి బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన అద్భుతమైన ఆటతో ఎంతో మంది అభిమానుల మనసులు గెలుచుకునేవాడట.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !