UPDATES  

NEWS

అచ్చం కిమ్ లెక్కనే బండి మాట… నా జీవితమంతా పోరాటమే –: సీఎం కేసీఆర్.. బుట్టబొమ్మ.. బతుకమ్మ.. అడవిలో అలజడి……మావోయిస్టు పార్టీ యాక్షన్ టీమ్ లు ఏజెన్సీలో సంచరిస్తున్న సమాచారంతో అప్రమత్తమైన పోలీస్ బృందాలు.. దిశ వెల్ఫేర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్షల మెటీరియల్ పంపిణీ. పది పరీక్షలకు సర్వం సిద్ధం.మండల విద్యాశాఖ అధికారి జి వెంకట్… కార్యకర్తలపై దాడులకు దిగితే కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు వస్తారు..? అంతా మాయజాలం మున్సిపాలిటీ టెండర్ వండర్ ఓ కంపెనీకి టెండర్ కట్టబెట్టడంలో మతలభేమిటి…? యువ సేవాసమితి అద్వర్యంలో పరీక్ష ఫ్యాడ్లు, పెన్నులు విద్యార్ధలకు బహుకరణ.. కూలిన కల్వర్టు అంచనాకు వచ్చిన ఇరిగేషన్ అధికారులు..ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాలతో కదిలిన అధికార యంత్రాంగం..

 టాలీవుడ్‌లో సంక్రాంతి సమరం ఆసక్తికరం

టాలీవుడ్‌లో సంక్రాంతి సమరం ఆసక్తికరంగా మారింది. చిరంజీవి వాల్తేర్ వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలు సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

ఇద్దరు టాప్ హీరోలు మధ్య సంక్రాంతి పోరు ఫ్యాన్స్‌లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. మరోవైపు సంక్రాంతి రేసులో తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన వారసుడు ఉంది. ఈ సినిమాతో పాటుగా అజిత్ తినువుతో పాటు మరో రెండు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.

అయితే ఆరు సినిమాలకు థియేటర్ల కేటాయింపు విషయంలో రకరకాల ప్రచారాలు జరుగుతోన్నాయి. వీటిలో ఏదో ఒక పెద్ద సినిమాను పోస్ట్ పోన్ చేస్తే మంచిదంటూ చెబుతున్నారు. పండుగ సమయంలో డబ్బింగ్ సినిమాలను విడుదల చేయద్దంటూ మరికొందరు టాలీవుడ్ ప్రముఖులు కామెంట్స్ చేస్తున్నారు.

కంటెంట్ బాగున్న మంచి సినిమాలకు ఎక్కువ థియేటర్లు దొరకుతాయని అన్నాడు. బలవంతంగా ఏ ప్రొడ్యూసర్ సినిమాను ఆపడం సాధ్యం కాదని తెలిపాడు. డబ్బింగ్ సినిమాల సమస్య చాలా రోజులుగా టాలీవుడ్‌లో ఉందని పేర్కొన్నాడు.

ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాలకు తమిళనాడులో థియేటర్లు కేటాయించినప్పుడు అక్కడి హీరోలు ఇబ్బందిగా ఫీలయ్యారని తెలిపాడు. బాహుబలి, పుష్ప, కేజీఎఫ్ సినిమాలు భాషా పరంగా సినిమాల మధ్య ఉన్న హద్దులను చెరిపివేశాయని సురేష్‌బాబు పేర్కొన్నాడు. భాషాభేదాల, స్ట్రెయిట్‌, రీమేక్ అనే తేడాలు లేకుండా ఈ సినిమా బాగుంటే అదే సంక్రాంతికి విజేతగా నిలుస్తుందని చెప్పాడు.

వెంకటేష్ హీరోగా నటించిన నారప్ప సినిమా గత ఏడాది ఓటీటీలో విడుదలైంది. వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా నారప్ప సినిమాను డిసెంబర్ 13న థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు. కేవలం ఒక రోజు (13వ తేదీ) మాత్రమే ఈ సినిమాను థియేటర్లలో స్క్రీనింగ్ చేయబోతున్నట్లు సురేష్ బాబు తెలిపాడు. ఈ సినిమా ద్వారా వచ్చే కలెక్షన్స్‌ను ఛారిటీ కోసం వినయోగించబోతున్నట్లు పేర్కొన్నాడు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !