UPDATES  

NEWS

పలు శుభకార్యాలకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు ఘనంగా తెలంగాణ రాష్ట్రఅవతరణ దశాబ్ది ఉత్సవాలు జాతీయ పథకాన్ని ఆవిష్కరించుకున్న ప్రభుత్వ విప్ రేగా జిల్లా కలెక్టర్ అనుదిప్ తెలంగాణ రైతు దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అనుదీప్ చదువు నేర్పేందుకు ఏర్పాటుచేసిన రేకుల షెడ్డు తొలగించడం సరికాదు కమలాపురం గ్రామ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి లను సన్మానించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క* నవ దంపతులను ఆశీర్వదించిన జెడ్పీ చైర్మన్ కోరం కంటి వెలుగుతో కంటి సమస్యలను పరిష్కరించుకోండి… మద్దుకూరు సర్పంచ్ పద్దం వినోద్… నూతన వధూవరులను ఆశీర్వదించిన కుడుముల లక్ష్మీనారాయణ పిఏసిఎస్ డైరెక్టర్ ను పరామర్శించిన సీనియర్ నాయకులు మంగపేట మండల పార్టీ అధ్యక్షులు మంచి మనసున్నోడు మనోహర్ బాబు

 వెకేషన్‌కు jr NTR..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్ర విజయాన్ని ఆస్వాదిస్తున్నారు.

కొరటాల శివతో ఆయన తన తదుపరి చిత్రానికి సంతకం చేసినప్పటికీ అది ఇప్పుడప్పుడే ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించట్లేదు. ఆచార్య పరాజయంతో విమర్శలు ఎదుర్కొన్న కొరటాల శివ.. తారక్‌తో సినిమా విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్క్రిప్టు విషయంలో ఎలాంటి రాజీ లేకుండా మార్పులు చేస్తున్నారట. అందుకే సినిమా ఆలస్యమవుతుందని సమాచారం. ఇందుకు మరికొంతకాలం పట్టే అవకాశముందని తెలియడంతో మన యంగ్ టైగర్ ఫ్యామిలీతో కలిసి హాలీడేకు ప్లాన్ చేశారని ఫిల్మ్ వర్గాల సమాచారం.

ఓ వారం రోజుల పాటు అమెరికాలో కుటుంబంతో కలిసి వెకేషన్‌కు వెళ్దామని తారక్ ప్లాన్ చేశారట. ఈ మేరకు భార్య పిల్లలతో కలిసి విమానాశ్రయంలో చేరుకున్న కొన్ని ఫొటోలు, వీడియోలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎన్టీఆర్‌తో పాటు ఆయన కుమారులు భార్గవ్ రామ్, అభయ్ రామ్ కూడా ఉండటం ఈ ఫొటోల్లో గమనించవచ్చు. ముగ్గురిని అలా ఒకేసారి చూడటంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న సినిమా NTR30 అనే వర్కింగ్ టైటిల్‌లో తెరకెక్కనుంది. ఆచార్య పరాజయంపై ఈ సినిమాపై పడకూడదని.. తారక్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నట్లు అంతర్గత వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. పాన్ఇండియా స్థాయిలోనే కాకుండా ఇంటర్నేషనల్ ప్రమాణాలతో సినిమాను తెరకెక్కించాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా ఓ కొలిక్కి రాలేదు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను చిత్రబృందం తెలియజేయనుంది.

నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై సంయుక్తంగా ఈ సినిమా రూపొందుతొంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తర్వాత తారక్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఈ చిత్రం కూడా వచ్చే ఏడాదే పట్టాలెక్కనుంది.

 

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !