UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 Ayurveda Remedies For Diabetes- మధుమేహానికి ఆయుర్వేద చిట్కాలు

ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించే వ్యక్తుల్లో కూడా అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. ఆకస్మిక గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్, స్ట్రోక్ వంటి కేసులు పెరుగుతున్నాయి.

ఒక వ్యక్తి ఎంత మంచి ఆహారం తిన్నప్పటికీ, ఎన్ని మంచి అలవాట్లు కలిగి ఉన్నప్పటికీ, ప్రతీ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే వ్యక్తులు కూడా వ్యాధులబారిన పడుతున్నారు. దీనికి కారణాలు అనేకం ఉండవచ్చు, అయితే లోపలి నుంచి కూడా దృఢంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

జీవక్రియ సమస్యలతో బాధపడని వ్యక్తులతో పోలిస్తే మధుమేహం ఉన్నవారికి గుండెపోటు లేదా స్ట్రోక్ వచ్చే ప్రమాదం రెండింతలు ఎక్కువ ఉంటుంది. మధుమేహం పెరుగుతున్న కొద్దీ గుండె ఆరోగ్యం క్షీణించే ప్రమాదం పెరుగుతుంది. అధిక రక్త చక్కెర కాలక్రమేణా గుండె నరాలను దెబ్బతీస్తుంది. డయాబెటీస్ సమస్య ఉన్నవారు తప్పనిసరిగా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవాలి. లేనిపక్షంలో అది గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

ఆయుర్వేద నిపుణురాలు డాక్టర్ దీక్షా భావ్‌సర్ డయాబెటీస్ సమస్యను అదుపులో ఉంచుతూ, గుండె జబ్బులను నివారించడంలో సహాయపడే 5 మూలికల గురించి తెలియజేశారు. అవేంటో చూడండి.

1) పునర్నవ

పునర్నవ అనేది చక్కెర స్థాయి, రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గించడంలో సహాయపడే ఉత్తమ మూత్రవిసర్జక మూలిక. ఇది కాలేయం, మూత్రపిండాలు, కళ్ళకు కూడా మంచిది. డయాబెటిక్ రెటినోపతి, నెఫ్రోపతీని నివారించడానికి ఉపయోగిస్తారు. ఇది జీవక్రియను కూడా మెరుగుపరుస్తుంది. ప్రతిరోజూ 2-5 గ్రాముల పునర్నవను ఖాళీ కడుపుతో తీసుకోవాలి.

2) శొంఠి

ఎండు అల్లం లేదా శొంఠి ఉత్తమ కార్డియో-ప్రొటెక్టివ్ మూలిక. మెటబాలిజం కోసం అద్భుతమైనది. ఇది మంటను కూడా తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యానికి మంచిది. మీరు భోజనానికి ముందు రోజుకు ఒకసారి గోరు వెచ్చని నీటిలో సగం టీస్పూన్ శొంఠి పొడిని కలిపి తీసుకోవచ్చు.

3) మరీచా (నల్ల మిరియాలు)

నల్ల మిరియాలు కూడా అందరి వంటగదిలో సులభంగ లభించేవి. ఈ హెర్బ్ ఇన్సులిన్ సెన్సిటివిటీ, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్‌లను కూడా తగ్గిస్తుంది. వయసు పెరిగిన వారిలో గుండెపోటులను నివారించడంలో సహాయపడుతుంది. మీరు ప్రతిరోజూ ఉదయం 1 స్పూన్ నల్ల మిరియాలు ఏ రూపంలో అయినా తీసుకోవచ్చు.

4) ఏలకులు

ఇది కూడా పోపుల పెట్టెలో కనిపించే ఒక సుగంధ దినుసు. గుండె ఆరోగ్యానికి ఉత్తమమైనది, చక్కెరకు బదులు యాలకులను ఉపయోగించాలి. ఇది ఆహార కోరికలను తగ్గించడం ద్వారా రక్తంలో ,చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. డయాబెటిక్ పేషెంట్లు తరచుగా చాలా దాహం వేస్తుంది. అటువంటి పరిస్థితులలో భోజనం చేసిన 1 గంట తర్వాత గోరువెచ్చని నీటిలో యాలకులు కలుపుకొని తాగాలి.

5) అర్జున్-చాల్

గుండె జబ్బుల నివారణకు , గుండె పనితీరును మెరుగుపరచడానికి ఇది ఉత్తమ మూలిక. రక్తపోటు, కొలెస్ట్రాల్ నుండి టాచీకార్డియా వరకు అన్ని రకాల గుండె సమస్యలకు మంచిది. మధుమేహం లేదా గుండె జబ్బులు ఉన్న వ్యక్తి నిద్రవేళలో టీ రూపంలో తినాలి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !