UPDATES  

 మీడియా ఛానల్‌తో మాట్లాడిన కీర్తి క్యాస్టింగ్ కౌచ్‌పై స్పందన

చిత్రసీమలో క్యాస్టింగ్ కౌచ్, కమ్మిట్మెంట్, లైంగిక వేధింపులు అనే మాటలు తరచూ వింటూనే ఉన్నాం. ఆ మధ్య కాలంలో వీటిపై ఓ మినీ ఉద్యమమే నడిచింది. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉన్న మాట వాస్తవేమేనని కొంతమంది నటీ, నటులు బాహటంగానే చెప్పినప్పటికీ.. కొంతమంది మాత్రం తాము ఎదుర్కోలేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ విషయంపై టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ స్పందించారు. ఈ ముద్దుగుమ్మ చిత్రసీమలో క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు ఉన్నాయని తేల్చి చెప్పారు.

ఇటీవల ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడిన కీర్తి క్యాస్టింగ్ కౌచ్‌పై తన స్పందనను తెలియజేశారు. “నాతో పని చేసిన చాలా మంది బాహాటంగానే నాతో లైంగిక వేధింపులు, క్యాస్టింగ్ కౌచ్ గురించి చెప్పారు. కానీ నేను ఇంతవరకు అలాంటి సంఘటనలను ఎదుర్కోలేదు. నేను అందరికీ తెలిసిన వ్యక్తినే. ఎవ్వరూ నాతో అనుచితంగా ప్రవర్తించలేదు. కనీసం ఇప్పటి వరకైతే లేదు. భవిష్యత్తులో జరగదని నేను చెప్పలేను” అని కీర్తి సురేష్ అన్నారు. ఎవరైనా అలాంటి ఆలోచనతో తన వద్దకు వస్తే మాత్రం.. ఆ ఆఫర్‌ను కూడా వదిలేస్తానని కీర్తి స్పష్టం చేశారు.

“లైంగికపరమైన ఆలోచనలు లేదా క్యాస్టింగ్ కౌచ్ లాంటి కమ్మింట్మెంట్‌లతో ఎవరైనా నా వద్దకు వస్తే నేను కచ్చితంగా తిరస్కరిస్తాను. ఎందుకంటే నాకసలు ఆ ఛాన్సే వద్దు. చిత్రసీమను వదిలి వేరే ఉద్యోగం చూసకుని వెళ్లిపోతాను.” అని కీర్తి తెలిపారు. ప్రస్తుతం కీర్తి సురేష్.. తెలుగులో నాని సరసన దసరా అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ఇది కాకుండా మెగాస్టార్ చిరంజీవితో భోళా శంకర్ అనే మరో మూవీలోనూ నటిస్తున్నారు. వీటితో పాటు తమిళంలో మరో రెండు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !