UPDATES  

 అర్జున్ రెడ్డి తర్వాత హిట్-2దే రికార్డు..

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ వరుస హిట్లతో దూసుకెళ్తున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే మేజర్ లాంటి సూపర్ సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ స్టార్.. ఇప్పుడు హిట్-2 రూపంలో మరో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా డిసెంబరు 2న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఈ సినిమా మరో అరుదైన ఘనతను సాధించింది. వసూళ్ల పరంగా అదరగొడుతున్న హిట్-2 ఓవర్స్ సీస్‌లో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. అమెరికాలో ఈ చిత్రం ఒక మిలియన్ డాలర్లను పైచిలుకు వసూళ్లను అందుకుంది.

తొలి వారంంతంలోనే కాకుండా సెకెండ్ వీకెండ్‌లో హిట్-2 వసూళ్లపై ఏ మాత్రం ప్రభావం పడలేదు. పెద్ద హీరోల సినిమాలు లేకపోవడం, వచ్చిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో హిట్-2కు ఆదరణ ఎక్కువగా ఉంది. యూఎస్ఏలో ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ డీసెంట్ వసూళ్లు రాగా.. రెండో వీకెండ్‌కు ఒక మిలియన్ డాలర్ మార్కును అందుకుంది. దీంతో అడివి శేష్ ఈ ఏడాదే తను నటించిన రెండు సినిమాలకు ఈ అరుదైన ఘనతను సాధించాడు. ఇప్పటికే మేజర్ చిత్రం కూడా ఒక మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరింది.

తాజాగా హిట్-2 ఈ రికార్డును అందుకుంది. అంతేకాకుండా సెన్సార్ నుంచి ‘A’ సర్టిఫికేట్ పొంది ఒక మిలియన్ డాలర్ మార్కును అందుకున్న రెండో తెలుగు చిత్రంగా హిట్-2 రికార్డు సృష్టించింది. అంతకుముందు అర్జున్ రెడ్డి సినిమా ఈ విధంగా వసూళ్లను అందకుంది. వాల్ పోస్టర్ సినిమాస్ పతాకంపై నాని నిర్మించిన ఈ సినిమా వసూళ్ల పరంగా ఇంకా దూసుకెళ్తూనే ఉంది. మొత్తంగా రూ.60 కోట్ల గ్రాస్‌కు సమీపంలో ఉంది.

నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ బోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్నెని ఈ చిత్రాన్ని నిర్మించారు. మీనాక్షి చౌదరీ హీరోయిన్‌గా చేశారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. గ్యారీ బీహెచ్ ఎడిటర్‌గా పనిచేయగా.. ఎస్ మణికందన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఈ సినిమాను డిసెంబరు 2న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !