కన్నడ,Kannada, పరిశ్రమ నుంచి వచ్చిన కాంతారా,Kantara Movie, 16 కోట్ల బడ్జెట్ తో నిర్మతమై.. 400 కోట్ల పైన వసూళ్లను రాబట్టింది. ముందు కన్నడ వరకే అనుకున్న ఈ సినిమాని పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేసారు. నేషనల్ లెవల్లో కాంతార అద్భుతాలు సృష్టించింది. ఇక చివరి అరగంట సినిమా అయితే ఆడియన్స్ కి కూడా పూనకాలు వచ్చేలా చేసింది. కాతార సినిమా చూసి వావ్ అన్నవాళ్లే ఉన్నారు తప్ప ఇదేం సినిమా అన్న వారు లేరు. కానీ బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కాంతార సినిమాలో ఏముందని అంతగా జనాలు ఎగబడి చూస్తున్నారని అన్నారు.
కాంతార సినిమా,Kantara Movie ,తనకు నచ్చలేదని.. అసలు ఈ సినిమాలో ఏం మెసేజ్ ఉంది. ఈ సినిమాల వల్ల పరిశ్రమ నాశం అవుతుందని అన్నారు. ఒకప్పుడు మరాఠి సినిమా సైరత్ సినిమా గురించి కూడా అనురాగ్ కశ్యప్,Anurag Kashyap, ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ సినిమా కూడా సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు కాంతర సినిమాపై అనురాగ్ విషాన్ని కక్కారు. సౌత్ సినిమాల గొప్పతనాన్ని మెచ్చుకోలేకనే బాలీవుడ్,Bolly wood, డైరెక్టర్స్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆడియన్స్ అంటున్నారు. సినిమాలో ఏ మ్యాజిక్ లేకపోతే ఇంతమంది ఆడియన్స్ ఎందుకు ఎట్రాక్ట్ అవుతారు.
కాంతర కర్ణాటక లో ఉన్న భూతకాల నేపథ్యం కథతో తెరకెక్కింది. అక్కడ మూలాలు ఉన్నాయి కాబట్టే సినిమా అంత గొప్పగా వచ్చింది. వాటిపై నమ్మక్ ఉంది కాబట్టే సినిమా ప్రేక్షకులను అంత బాగా ఆకట్టుకుందని చెప్పొచ్చు. ఏది ఏమైనా సినిమా హిట్ అయినందుకు సంతోషపడాలే తప్ప సినిమాలో ఏముందని అంతగా చూస్తున్నారు అంటూ సౌత్ సినిమాపై అసూయ వెల్లగక్కడం సౌత్ ఆడియన్స్ కి నచ్చట్లేదు. ఇంత గొప్ప సినిమాలో అసలు విషయం లేదని పరిశ్రమ నష్టపోతుందని చెప్పిన అనురాగ్ పై సౌత్ ఆడియన్స్ ఫైర్ అవుతున్నారు.