ఖైదీ, విక్రమ్ సక్సెస్‌లతో కోలీవుడ్‌లో అగ్ర దర్శకుల జాబితాలో చేరిపోయాడు లోకేష్ కనకరాజ్. కమల్‌హాసన్ హీరోగా లొకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన విక్రమ్ సినిమా ఈ ఏడాది అత్యధి కలెక్షన్స్ దక్కించుకున్న ఇండియన్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఖైదీ, విక్రమ్ సక్సెస్ తర్వాత అతడితో సినిమాలు చేసేందుకు పలు భాషలకు చెందిన స్టార్ హీరోలు ఆసక్తిని చూపుతున్నారు. విక్రమ్ ఘన విజయం తర్వాత తమిళ స్టార్ హీరో విజయ్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు లోకేష్ కనకరాజ్. ఈ సినిమాతో పాటుగా తన తదుపరి ప్రాజెక్ట్‌లపై ఓ ఇంటర్వ్యూలో లోకేష్ ఆసక్తికర విషయాల్ని పంచుకున్నాడు. విజయ్ సినిమా తర్వాత ఖైదీ సీక్వెల్ చేయనున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత విక్రమ్ సీక్వెల్‌ను కూడా సెట్స్‌పైకి తీసుకొస్తానని తెలిపాడు.
ఈ రెండు సీక్వెల్స్ తర్వాత సూర్యతో రోలెక్స్ క్యారెక్టర్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమా చేసే ప్లాన్‌లో ఉన్నట్లు పేర్కొన్నాడు. విక్రమ్ సినిమా క్లైమాక్స్‌లో రొలెక్స్‌గా నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో సూర్య కనిపించాడు. అతడు క్యారెక్టర్ నిడివి పది నిమిషాల లోపే ఉన్నా అభిమానుల్లో మాత్రం ఈ క్యారెక్టర్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సూర్య పాత్రను ఫుల్ లెంగ్త్‌గా డెవలప్ చేసే ఆలోచనలో ఉన్నట్లు లోకేష్ కనకరాజ్ పేర్కొన్నాడు. విక్రమ్ కు ప్రీక్వెల్‌గా సూర్య రోలెక్స్ సినిమా ఉండబోతున్నట్లు తెలిపాడు.
వచ్చే పదేళ్ల వరకు ఈ సినిమాలతోనే బిజీగా ఉండబోతున్నట్లు పేర్కొన్నాడు. లొకేష్ కనకరాజ్ ఒకేసారి నాలుగు సినిమాల్ని అనౌన్స్‌చేయడం కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. విజయ్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న సినిమా త్వరలోనే సెట్స్‌పైకిరానుందది. ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. లోకేష్ శైలి హంగులతో స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందనున్నట్లు సమాచారం. విజయ్ హీరోగా నటిస్తోన్న 67వ సినిమా ఇది.