కడప స్టీల్ ప్లాంట్ మూడేళ్లలో ప్రారంభిస్తామని.. 25 వేల మంది యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు ఇప్పుడు మూడో కృష్ణుడిని స్టేజ్ మీదకు తెచ్చారు.
శంకుస్థాపన రోజున ముఖ్యమంత్రి పెద్దపెద్ద మాటలు చెబుతూ స్టీల్ ప్లాంట్ ద్వారా రాయలసీమలో వలసలు నివారిస్తామని చెప్పారు. ఇప్పటి వరకూ ముందుకు వెళ్లలేదు. పునాది రాయి మాత్రం పడలేదు. ఈ రోజు క్యాబినెట్ మీటింగ్ లో కొత్త పరిశ్రమ తెచ్చినట్లు హంగామా చేస్తున్నారు.
మొదట లిబర్టీ ఎస్సార్ స్టీల్స్ అనే కృష్ణుడు వచ్చాడు రూ.17 వేల కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పాడు. తరువాత స్విట్జర్లాండ్ కు చెందిన మరో కృష్ణుడు రూ. 12 వేల కోట్ల పెట్టుబడితో స్టీల్ ప్లాంట్ నిర్మిస్తామని చెప్పాడు. ఆయనా పక్కకు తప్పుకున్నాడు. ఇప్పుడు తాజాగా రూ.8 వేల కోట్లు పెట్టుబడులు పెడతామని మూడో కృష్ణుడుగా జేఎస్ డబ్ల్యూ అనే కొత్త కంపెనీ వచ్చింది.
ప్రాజెక్టు ఇన్ని కంపెనీల చేతులు మారడానికి, నిర్మాణంలో జరుగుతున్న జాప్యానికి గల కారణాలను ముఖ్యమంత్రి గారు ప్రజలకు వివరించాలి. అలాగే కడప స్టీల్ ప్లాంటు కోసం కృష్ణపట్నం పోర్టులో ఒక బెర్త్ కేటాయించారు. ఆ బెర్త్ ఎవరికి అమ్మేశారు? దాని వెనుక జరిగిన జగన్నాటకాన్ని ప్రజలకు వివరించాలి.