UPDATES  

 ప్రభుత్వ అక్రమ కేసులకు జన సైనికులు భయపడొద్దు

* జనసేన నాయకులు, శ్రేణులకు న్యాయపరమైన అండ
* రాష్ట్రాన్ని వైసీపీ పాలకులు గంజాయి ప్రదేశ్ చేశారు

* యువతకు సులభంగా గంజాయి దొరుకుతోంది… ఉపాధి మాత్రం దొరకడం లేదు
* ఎన్నికల ముందు ముద్దులు పెట్టిన జగన్ రెడ్డి ఇప్పుడు మొహం చాటేస్తున్నారు
* పచ్చని కోనసీమలో చిచ్చు పెట్టాలని వైసీపీ చూసింది
* కోనసీమ నుంచీ వలసలు పెరిగిపోతున్నాయి
* వ్యూహంతో, ఓర్పుతో రాజకీయాలు చేద్దాం
* పి. గన్నవరం నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

 

ప్రజా పోరాటాలతో ముందుకు వెళ్ళండి… జన సైనికులు మీద ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. కచ్చితంగా రాష్ట్రంలోని ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో జనసేన పార్టీ తరఫు నుంచి ఒక న్యాయవాది ఉండేలా శ్రీ పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకుంటున్నారని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గ కార్యకర్తల సమావేశం అంబాజీపేటలో మంగళవారం సాయంత్రం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ ‘సామాన్యులు మా బతుకు మేం బతుకుతాం అంటే కనీస సౌకర్యాలు, సహాయం అందించని ప్రభుత్వం ఇది. ఎప్పుడు ఎవరిపై కక్ష సాధించాలా.. ఎవరి పొట్ట కొట్టాలా అన్న ఆలోచన తప్ప వేరే ఏమి చేతకాని పాలన ఇది. ఇంతకాలం ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలబడి, తమ ఉద్యోగాలు ఎప్పటికైనా పర్మినెంట్ అవుతాయని భావిస్తున్న వాలంటీర్ల కడుపు కొట్టడానికి ఈ ప్రభుత్వం గృహ సారథులను నియమిస్తోంది. ఉత్తరాంధ్రలోనే వలసలు ఎక్కువ అనుకున్నాం. అయితే కోనసీమ నుంచీ వలసలు ఏ విధంగా ఉన్నాయో తెలిస్తే విస్తుపోతాం. పార్టీ క్రియాశీలక సభ్యుడు శ్రీ చెరుకూరి పనసరాముడు మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు, ఆయన తమిళనాడుకు వలస వెళ్లి ఉపాధి కోసం పని చేస్తున్న తీరును వారి కుటుంబ సభ్యులు చెప్పడం కలిచివేసింది.

* బటన్ పాలన
బటన్ నొక్కడం తప్ప ఇంకేం చేయను అన్నట్లు ఉంది ఈ వైసీపీ ముఖ్యమంత్రి తీరు. 56 బీసీ కార్పొరేషన్లకు కనీస నిధులు విడుదల చేయడం లేదు. బీసీలకు కనీసం ఒక్క రుణం కూడా ఈ ప్రభుత్వంలో రాలేదు. బీసీల సంక్షేమాన్ని కనీసం పట్టించుకోని ప్రభుత్వం… కేవలం ప్రకటనలు, గర్జనలు అంటూ కాలం గడిపేస్తోంది. వైసీపీ సభలకు కళాశాలలకు, పాఠశాలలకు సెలవులు ఇచ్చి మరీ బస్సులలో జనం తరలిస్తున్నారు. మీ పాలన అద్భుతంగా ఉంటే ఇలా బలవంతంగా జనం తరలించడం ఎందుకు..? గడపగడపకు కార్యక్రమంలో భాగంగా ముందుగానే కొన్ని ఇళ్ళను ఎంపిక చేసుకొని, వాళ్లకు తగిన తర్ఫీదు ఇచ్చి వెళ్లే దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకు..?
* ఆర్బీకేలు వైసీపీ కేంద్రాలు
మాండౌస్ తుపాను వస్తే రైతుల పంట నష్టం మీద కనీసం ఏ అధికారి స్పందించలేదు. అసలు పంట నష్టం ఎంత వచ్చింది..? తీసుకున్న సహాయక చర్యల గురించి చెప్పే నాథుడు లేడు. రైతు భరోసా కేంద్రాలు పూర్తిస్థాయిలో వైసీపీ కేంద్రాలుగా మారిపోయాయి. జగనన్న ఇళ్లలో అంతులేని దోపిడీ చేశారు. భూముల కొనుగోలు మాయ రాత్రికి రాత్రి జరిగింది. ప్రజాధనంలోని రూ. 23,500 కోట్లను వైసీపీ నాయకులు జేబులో వేసుకున్నారు. ఈ అవినీతి తతంగాన్ని బయటపెట్టింది జనసేన పార్టీ మాత్రమే.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !