UPDATES  

NEWS

జన చైతన్య యాత్రకు ఘన స్వాగతం… మంచి ఆదరణతో దూసుకుపోతున్న ఆరోగ్య మహిళ పథకం.. సింగరేణిలో 60 లక్షలు విలువ చేసే కేబుల్ చోరీ.. మంచినీటి సమస్యపై ఐటీడీఏ అధికారులు కలిసిన బిజెపి నాయకులు.. విద్యార్థులకు “ఆయుష్ న్యూట్రిషన్ కిట్లు” పంపిణీ చేసిన యునాని డాక్టర్ రాజేంద్ర రావు.. ఇటుకలు మీరు మోస్తున్నారా..?  క్రీడా మైదానం పనులు  ప్రారంభించదానికి ఇంత ఆలస్యం ఏంటి ?  ఐ టి డి ఎ ఇంజనీరింగ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం… మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం… ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్.. మన ఊరి మనబడి బడ్జెట్లో గండి.. కంటి వెలుగు పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి డి ఎం హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య..

 యూకే సౌత్‌ ఏషియన్‌ సెలబ్రిటీ లిస్ట్‌లో top తారక్, చరణ్

ఆర్‌ఆర్ఆర్‌ మూవీయే కాదు.. అందులోని స్టార్లు కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్‌ లెవల్లో మెరుస్తున్నారు. సినిమా పాన్‌ ఇండియా లెవల్లో దుమ్ము రేపగా.. అది కాస్తా మెల్లగా అంతర్జాతీయ స్థాయికి చేరింది. హాలీవుడ్‌ ప్రముఖుల మెప్పు పొందించింది. ఇంటర్నేషనల్ అవార్డులను సొంతం చేసుకుంటోంది. ఇక ఇప్పుడు ఈ మూవీలో రామ్‌, భీమ్‌గా కనిపించిన రామ్‌చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌.. యూకేలో ప్రతి ఏటా రిలీజ్‌ చేసే టాప్‌ 50 ఏషియన్‌ సెలబ్రిటీస్‌ ఇన్‌ ద వరల్డ్‌ లిస్ట్‌లో సంయుక్తంగా టాప్‌లో నిలిచారు. ఈ 2022 లిస్ట్‌ రానున్న శుక్రవారం యూకే వీక్లీ మ్యాగజైన్‌ అయిన ఈస్టర్న్‌ ఐలో ప్రచురితమవుతుంది. ఓ ప్రాంతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో ఆకర్షించేలా చేసిన నటులుగా వీళ్లను కొనియాడింది. “ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీతో జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ సినిమా హాళ్లలో అగ్గి పుట్టించారు.

అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులకు గతంలో ఎప్పుడూ చూడని ఇండియన్‌ కమర్షియల్ సినిమాలోని మజాను అందించారు” అని ఈ లిస్ట్‌ను తయారు చేసిన ఈస్టర్న్‌ ఐ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎడిటర్‌ అస్‌జద్‌ నజీర్‌ అన్నారు. అందుకే ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ ఆస్కార్స్‌లోని అన్ని కేటగిరీలకు నామినేట్‌ అవడానికి ప్రయత్నిస్తోందని, ఇప్పటికే స్పాట్‌లైట్‌ అవార్డు అందుకోవడంతోపాటు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల్లో రెండు కేటగిరీల్లో నామినేట్‌ అయిందని ఆయన చెప్పారు. 2022లో సినిమా, మ్యూజిక్‌, ఆర్ట్స్‌లో తమదైన ముద్ర వేసిన టాప్‌ 50 సౌత్‌ ఏషియన్‌ స్టార్లు ఈ జాబితాలో స్థానం సంపాదించారు. రామ్‌చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ల తర్వాత పాకిస్థాన్‌ నటుడు ఫవద్‌ ఖాన్‌ రెండోస్థానంలో నిలిచాడు. ఇక మూడో స్థానంలో బ్రిటీష్‌ ఇండియన్‌ యాక్టర్‌ సిమోన్‌ యాష్లీ ఉండగా.. నాలుగో స్థానంలో బాలీవుడ్‌ నటి ఆలియా బట్‌, ఐదో స్థానంలో పాకిస్థాన్‌ నటుడు ఇమాన్‌ వెల్లానీ నిలిచారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !