UPDATES  

 AVATAR సినిమాకు కేవలం 2 రేటింగ్

అవతార్‌ ది వే ఆఫ్‌ వాటర్‌ మూవీ కోసం ప్రపంచం మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోంది. ఈ శుక్రవారం (డిసెంబర్‌ 16) ప్రపంచవ్యాప్తంగా జేమ్స్‌ కామెరాన్‌ సృష్టించిన ఈ అద్భుతం రిలీజ్‌ కాబోతోంది. అయితే ఇప్పటికే ఈ సినిమా రివ్యూలు వస్తున్నాయి. జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలు కొన్ని అవతార్‌ 2 మూవీపై రివ్యూలు ఇచ్చేశాయి. అయితే ఇండియాలోని ప్రముఖ మీడియా సంస్థలు ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలే ఇచ్చినా.. అంతర్జాతీయ మీడియా మాత్రం దారుణమైన రేటింగ్స్‌ ఇస్తున్నాయి. 13 ఏళ్ల నిరీక్షణ తర్వాత వచ్చిన ఈ మూవీ తీవ్ర నిరాశ కలిగించిందని చెప్పడం గమనార్హం.

ప్రముఖ వెబ్‌సైట్‌ గార్డియన్‌ ఈ సినిమాకు కేవలం 2 రేటింగ్ మాత్రమే ఇచ్చింది. 30 నిమిషాల కార్టూన్‌తో చెప్పే స్టోరీని మూడు గంటలకుపైగా సాగదీసినట్లుగా ఉన్నదని గార్డియన్‌ ఘాటు వ్యాఖ్య చేసింది. ఇక ది టెలిగ్రాఫ్‌ అయితే ఈ మూవీ కేవలం వన్‌ స్టార్‌ రేటింగే ఇచ్చింది. అసలు ఈ సినిమాలో చెప్పుకోవడానికి ఏమీ లేదని అనడం విశేషం. అయితే టెక్నికల్‌గా మాత్రం సినిమా బాగుందని చెప్పింది. అటు టైమ్‌ మ్యాగజైన్‌ కూడా ఈ సినిమాకు టూ స్టార్‌ రేటింగ్‌ మాత్రమే ఇచ్చింది. విజువల్స్‌ పరంగా అద్భుతంగా ఉన్నా.. చెప్పుకోవడానికి పెద్దగా స్టోరీ ఏమీ లేదని అనడం గమనార్హం. అవతార్‌ ది వే ఆఫ్‌ వాటర్‌ మూవీ 13 ఏళ్ల కిందట వచ్చిన అవతార్‌ మూవీకి సీక్వెల్‌. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 52 వేల స్క్రీన్లలో ఈ శుక్రవారం (డిసెంబర్‌ 16) రిలీజ్‌ కాబోతోంది. ఇండియాలోనూ 3 వేల స్క్రీన్లలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇంగ్లిష్‌తోపాటు తెలుగు, హిందీల్లోనూ ఈ సినిమా చూడొచ్చు. అయితే రిలీజ్‌కు ముందే వచ్చిన ఈ మిశ్రమ రివ్యూలు.. అవతార్‌ 2పై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !