బాలీవుడ్ హీరోలతో పోలిస్తే.. సౌత్ నటులు సింపుల్‌గా, గర్వం లేకుండా ఉంటారని మంచి పేరుంది. చాలా సార్లు బీటౌన్ మీడియా ముందు మన హీరోలు నిరూపించారు. తాజాగా మరోసారి ఈ విషయాన్ని నిరూపించారు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్. సహచరులకు మర్యాద ఇవ్వడంలో తండ్రి చిరంజీవి గుర్తు చేశారు. బాలీవుడ్ ప్రముఖ గాయని నేహ కక్కర్ ఓ కార్యక్రమానికి హాజరు కాగా.. అక్కడే ఉన్న చరణ్.. ఆమెను గుర్తుపట్టడమే కాకుండా కుర్చీలో నుంచి లేచీ మరి నమస్కరిస్తూ మర్యాదగా ప్రవర్తించారు. ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన రామ్ చరణ్.. అదే ఈవెంట్‌కు విచ్చేసిన సింగర్ నేహా కక్కర్‌ను మర్యాదపూర్వకంగా పలకరించారు.
అంతేకాకుండా తను కూర్చున్న కుర్చీలో నుంచి లేచి మరీ షేక్ హ్యాండ్ ఇస్తూ గౌరవించారు. అంతటితో ఆగకుండా ఆమెకు తను పెద్ద ఫ్యాన్ అంటూ తెలిపారు. ఇందుకు ఆమె కూడా తాను కూడా చరణ్‌కు పెద్ద ఫ్యాన్ అంటూ సమాధానమిచ్చారు. ఈ విషయాన్ని నేహా కక్కర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలియజేశారు. అంతేకాకుండా వీడియోను షేర్ చేశారు. “రామ్ చరణ్ గారు నాకు పెద్ద అభిమానని చెప్పడం ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఎందుకంటే పబ్లిక్‌గా ఇతరులను మెచ్చుకునే వారు ఎవరూ ఉండరు. కాబట్టి ఇది నాకు చాలా పెద్ద విషయం. ఆయనకు ఇంత మంది అభిమానులు ఎందుకున్నారో నాకు ఇప్పుడు తెలిసింది. ఆయన సింప్లిసిటీ, డౌన్ టూ ఎర్త్ నేచర్ అద్భుతమని అభిమానుల్లో ఒకరు నాకు తెలిపారు.”
అంటూ నేహా కక్కర్ తన పోస్టులో పేర్కొన్నారు. నేహా కక్కర్ పింక్-ఆరెంజ్ కలర్ షేడ్ డ్రెస్‌ను ధరించగా.. రామ్ చరణ్ బ్లూ సూట్‌లో ఆకర్షణీయంగా కనిపించారు. ప్రస్తుతం రామ్ చరణ్.. శంకర్ దర్శకత్వంలో RC15 సినిమాతో బిజీగా ఉన్నారు. ఇందులో ఆయన సరసన కియారా అద్వానీ నటిస్తోంది. చెర్రీతో కియారాకు ఇది రెండో సినిమా. ఇంతకుముందు వినయ విధేయ రామలో కలిసి నటించింది ఈ ముద్దుగుమ్మ. రామ్‌చరణ్-శంకర్ కాంబినేషన్ వస్తోన్న ఈ సినిమాకు దిల్‌రాజు నిర్మాత. ఈ చిత్రం రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుందని సమాచారం. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఇది కాకుండా బుచ్చిబాబు సానం దర్శకత్వంలో ఇప్పటికే ఓ సినిమాకు సంతకం చేశారు చరణ్.