UPDATES  

NEWS

జన చైతన్య యాత్రకు ఘన స్వాగతం… మంచి ఆదరణతో దూసుకుపోతున్న ఆరోగ్య మహిళ పథకం.. సింగరేణిలో 60 లక్షలు విలువ చేసే కేబుల్ చోరీ.. మంచినీటి సమస్యపై ఐటీడీఏ అధికారులు కలిసిన బిజెపి నాయకులు.. విద్యార్థులకు “ఆయుష్ న్యూట్రిషన్ కిట్లు” పంపిణీ చేసిన యునాని డాక్టర్ రాజేంద్ర రావు.. ఇటుకలు మీరు మోస్తున్నారా..?  క్రీడా మైదానం పనులు  ప్రారంభించదానికి ఇంత ఆలస్యం ఏంటి ?  ఐ టి డి ఎ ఇంజనీరింగ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం… మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం… ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్.. మన ఊరి మనబడి బడ్జెట్లో గండి.. కంటి వెలుగు పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి డి ఎం హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య..

 కల్పిక వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్

కల్పిక గణేష్.. టాలీవుడ్‌లో చాలా సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్లలో, హీరోయిన్ ఫ్రెండ్ పాత్రల్లో మెప్పించిన ఈ నటి.. ఇటీవల కాలంలో తన ఘాటు వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. పలువురు యాక్టర్లు, రేడీయో జాకీలు, సినీ దర్శకులపై ఈ ముద్దుగుమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫలితంగా నెట్టింట పెద్ద దుమారమే లేపాయి. సెలబ్రెటీల వ్యక్తిగత విషయాల గురించి షాకింగ్ కామెంట్స్ చేయడంతో సోషల్ మీడియాలో కల్పికా గురించి బజ్ ఏర్పడింది. తాజాగా మరో టాలీవుడ్ నటిపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రముఖ నటి ధన్యా బాలకృష్ణపై కల్పిక సంచలన వ్యాఖ్యలు చేసింది. ధన్యాకు రహస్యంగా వివాహం జరిగిందని, అయితే బయటకు మమాత్రం కానట్లే ఉంటుందని ఆరోపణలు చేసింది. లవ్ ఫెయిల్యూర్ మూవీ డైరెక్టర్ బాలాజీ మోహన్‌ను ఈమె సీక్రెట్‌గా వివాహం చేసుకున్నట్లు స్పష్టం చేసింది. తన యూట్యూబ్ ఛానల్‌లో వీడియో పోస్ట్ చేసిన కల్పిక.. అందులో ఈ వ్యాఖ్యలు చేసింది.

దీంతో కల్పిక వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. నెటిజన్లు కూడా విశేషంగా ఆమె వ్యాఖ్యలపై స్పందించారు. అయితే ఈ వీడియోను స్వల్ప వ్యవధిలోనే తొలగించింది. అయితే ఆమె మాత్రం ఇందుకు విరుద్ధంగా స్పందించింది. ఆమెను ధన్యాకు క్లోజ్ ఫ్రెండ్ అయిన తమిళ సూపర్‌స్టార్ ధనుష్.. తన ప్రభావంతో యూట్యూబ్ నుంచి వీడియోను తొలగించినట్లు స్పష్టం చేసింది. కల్పిక గణేష్ ఇప్పటికే పలువురు సెలబ్రెటీలపై ఈ విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా ఇంటర్నెట్‌లో ప్రముఖల ఫొటోలను ఎలా మార్ఫింగ్ చేస్తారో కూడా వివరించింది. సోషల్ మీడియాలో వేదికగా పలువురు ప్రముఖులను టార్గెట్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ రావడంతో ఇటీవల కాలంలో ఆమెకు విపరీతంగా బజ్ ఏర్పడింది. పబ్లిసిటీ కోసమే కల్పిక ఇదంతా చేస్తుందంటూ కొంతమంది తమ స్పందనలను తెలియజేస్తున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !