UPDATES  

NEWS

జన చైతన్య యాత్రకు ఘన స్వాగతం… మంచి ఆదరణతో దూసుకుపోతున్న ఆరోగ్య మహిళ పథకం.. సింగరేణిలో 60 లక్షలు విలువ చేసే కేబుల్ చోరీ.. మంచినీటి సమస్యపై ఐటీడీఏ అధికారులు కలిసిన బిజెపి నాయకులు.. విద్యార్థులకు “ఆయుష్ న్యూట్రిషన్ కిట్లు” పంపిణీ చేసిన యునాని డాక్టర్ రాజేంద్ర రావు.. ఇటుకలు మీరు మోస్తున్నారా..?  క్రీడా మైదానం పనులు  ప్రారంభించదానికి ఇంత ఆలస్యం ఏంటి ?  ఐ టి డి ఎ ఇంజనీరింగ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం… మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం… ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్.. మన ఊరి మనబడి బడ్జెట్లో గండి.. కంటి వెలుగు పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి డి ఎం హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య..

 18 పేజెస్… అల్లు అర్జున్ మెయిన్ గెస్ట్‌గా రాబోతున్నట్లు అనౌన్స్

కార్తికేయ-2 తర్వాత నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రం 18 పేజెస్. డిఫరెంట్ లవ్ స్టోరీగా రూపొందుతోన్న ఈ సినిమా డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు అగ్ర దర్శకుడు సుకుమార్ కథ, స్క్రీన్‌ప్లేను అందించారు. కుమారి 21 ఎఫ్ ఫేమ్ సూర్యప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహిస్తున్నాడు. 18 పేజెస్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను డిసెంబర్ 19న హైదరాబాద్‌లో నిర్వహించబోతున్నారు. ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

ఓ స్పెషల్ వీడియో ద్వారా అల్లు అర్జున్ మెయిన్ గెస్ట్‌గా రాబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ వీడియోలో నిఖిల్‌తో పాటు నటుడు అభినవ్ కనిపించారు. ఈ సినిమా ట్రైలర్‌ను డిసెంబర్ 17న రిలీజ్ చేయబోతున్నారు. జీఏ2 పిక్చర్స్‌, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై బన్నీవాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన కార్తికేయ -2తో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్నాడు నిఖిల్‌. కృష్ణతత్వానికి అడ్వెంచర్ అంశాలను మేళవించి దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన ఈ సినిమా 130 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కార్తికేయ-2 సక్సెస్ తర్వాత వస్తోన్న 18 పేజెస్ సినిమాపై టాలీవుడ్‌లో భారీగానే అంచనాలు నెలకొన్నాయి

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !