UPDATES  

NEWS

జన చైతన్య యాత్రకు ఘన స్వాగతం… మంచి ఆదరణతో దూసుకుపోతున్న ఆరోగ్య మహిళ పథకం.. సింగరేణిలో 60 లక్షలు విలువ చేసే కేబుల్ చోరీ.. మంచినీటి సమస్యపై ఐటీడీఏ అధికారులు కలిసిన బిజెపి నాయకులు.. విద్యార్థులకు “ఆయుష్ న్యూట్రిషన్ కిట్లు” పంపిణీ చేసిన యునాని డాక్టర్ రాజేంద్ర రావు.. ఇటుకలు మీరు మోస్తున్నారా..?  క్రీడా మైదానం పనులు  ప్రారంభించదానికి ఇంత ఆలస్యం ఏంటి ?  ఐ టి డి ఎ ఇంజనీరింగ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం… మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం… ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్.. మన ఊరి మనబడి బడ్జెట్లో గండి.. కంటి వెలుగు పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి డి ఎం హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య..

 DHAMAKA ట్రైలర్ లో ఓ డైలాగ్ మాత్రం కాంట్రవర్సీ

మాస్ మహారాజా రవితేజ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇక రవితేజ లేటెస్ట్ సినిమా ‘ ధమాకా ‘ టీజర్ కూడా విడుదల అయింది. ఇక ఈ ట్రైలర్ కి పవర్ ఫుల్ మాస్ సినిమా అని టాక్ వచ్చేసింది. రవితేజ ఎనర్జీ ఇప్పటికి ఏమాత్రం తగ్గలేదు. ఈ సినిమాలో కూడా అదే ఎనర్జీతో డాన్స్, డైలాగ్స్ తో కుమ్మేసాడు. ఇక హీరోయిన్గా శ్రీ లీల తన అందం, తన మాటలు, ఎక్స్ప్రెషన్స్, రవితేజ డ్యూయల్ రోల్ చేయడం డిఫరెంట్ వేరియేషన్స్లో కనిపించడం ఈ సినిమా టీజర్ పై అంచనాలు పెరిగాయి. ఇక ఈ ధమాకా సినిమాను నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహించారు. నిజంగా ఈ సినిమా ట్రైలర్ చూశాక సినిమా చూసినంతగా అనిపించింది. రవితేజకు చాలా రోజుల తర్వాత హిట్ రాబోతుందని ఈ టీజర్ చూశాక ప్రేక్షకులలో అంచనాలు పెరిగాయి.

అయితే ఈ ట్రైలర్ లో ఓ డైలాగ్ మాత్రం కాంట్రవర్సీకి దారితీస్తుంది. దీంతోపాటు స్టార్ హీరోస్ తారక్, బన్నీ, చరణ్ ఫాన్స్ రవితేజ కావాలనే ఆ డైలాగుతో తమ హీరోలను టార్గెట్ చేసాడంటూ ఫైర్ అవుతున్నారు. ‘ నేను వెనుకున్న వాళ్ళని చూసి ముందుకొచ్చినోడిని కాదురోయ్, వెనక ఎవడు లేకపోయినా ముందుకు రావచ్చు అని ఎగ్జాంపుల్ సెట్ చేసిన వాడిని ‘ Ravi Teja dialogues creates nuisance in tollywood అన్న డైలాగ్ రవితేజ సినిమాలో చెబుతాడు. అంటే తెలుగు పరిశ్రమలో బ్యాక్‌గ్రౌండ్ ఉన్న స్టార్ హీరోలను టార్గెట్ చేస్తూ కావాలనే ఈడైలాగ్ చెప్పాడన్న కాంట్రవర్సీని ఇప్పుడు ఆ ముగ్గురు హీరోల అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేశారు. రవితేజకు ఆరు ఏడు సినిమాలు చేస్తే కానీ ఒక్క హిట్ రావడం లేదు. ఈ ఏడాది రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అలాంటిది ఆయనకి ఇంత ఓవర్ అవసరమా అని ముగ్గురు హీరోలు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ కాంట్రవర్సీ ఈ సినిమాపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !