UPDATES  

NEWS

ఘనంగా కొండలక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు… భక్తులకు అన్నదానం చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు పట్ల నల్ల బ్యాడ్జిలతో నిరసన ర్యాలీ : ఏఐటియుసి పోరాట ఫలితమే 32శాతం లాభాలవాటా డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సారయ్య *హరిప్రియ ఫౌండేషన్ ఉచిత వైద్యశాల సేవలు అభినందనీయం మారుమూల గ్రామానికి కరెంటు లైన్ క్లియర్ మామిళ్ళవాయికి త్రీ పేజ్ విద్యుత్ లైన్ మంత్రి కేటీఆర్ మాటలు సరి కాదు తెదేపా ఇల్లందు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ మణుగూరు మున్సిపాలిటీ డ్రింకింగ్ వాటర్ కు 20 కోట్ల రూపాయల నిధుల మంజూరు పలు శుభకార్యాలకు హాజరైన రేగా సుధారాణి మణుగూరు సిఐ బాలాజీ వరప్రసాద్ ఆకస్మిక బదిలి

 పెళ్లయ్యి బిడ్డ ఉన్న గాని జోరు తగ్గని కాజల్

హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ రెండో సినిమా ‘మగధీర’తో ఇండస్ట్రీ హిట్ అందుకుని స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోలు మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్.. మరి కొంతమంది కుర్ర హీరోలతో పాటు సీనియర్ హీరోలతో సినిమాలు చేస్తూ మూడు సంవత్సరాల క్రితం బిజీ బిజీగా గడిపింది. ఒక్క తెలుగులోనే కాదు దక్షిణాది సినిమా రంగంలో అనేక అవకాశాలు అందుకోవటం జరిగింది. అనంతరం బాలీవుడ్ ఇండస్ట్రీకి మకాం మార్చి… అక్కడ రాణించాలని చూడగా పరాజ్యాలు ఎదురుకావడంతో మళ్లీ దక్షిణాదిలో రియంట్రి ఇచ్చి సినిమాలు చేయటం జరిగింది. అయితే సరిగ్గా లాక్ డౌన్ సమయంలో 2020 అక్టోబర్ 30 వ తారీకు గౌతమ్ కిచ్చు అనే వ్యాపారవేత్తని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఓ మగ బిడ్డకు జన్మనిచ్చింది.

ఈ సందర్భంగా తన కొడుకు క్యూట్ ఫోటోలను మరియు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసి మురిసిపోతుంది. పెళ్లయిన తర్వాత గర్భం దాల్చడంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇవ్వటం జరిగింది. కాగా బిడ్డను కన్నాక అనేక ఫోటోలను ఫాలోవర్స్ కి షేర్ చేయడం జరిగింది. ఇదే సమయంలో ఎప్పటికప్పుడు తన ఆరోగ్య వివరాలను కూడా పంచుకుంటూ ఉండేది. Kajal Aggarwal son photos and videos are viral in social media ఈ ఏడాది ఏప్రిల్ 19వ తారీకు మగ బిడ్డకు జన్మనిచ్చిన కాజల్ అగర్వాల్.. మళ్లీ సినిమాలోకి రీ ఎంట్రీ ఇవటానికి ప్రస్తుతం కసరతులు చేస్తున్నట్లు టాక్. కాజల్ కొడుకు పేరు నిల్ కిచ్ లు. ఈ సందర్భంగా తన కొడుకు ఫోటోలతో పాటు భర్తతో దిగిన ఫోటోలను..వీడియోలు అందరికీ షేర్ చేసి తన ఆనందాన్ని పంచుకుంది. భర్త బిడ్డతో కాజల్ అగర్వాల్ సంతోషంగా ఉండటంతో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ… హ్యాపీ ఫ్యామిలీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే బాబు ఫోటోలతో పాటు భర్త ఫోటోలు ఇంకా స్నానం చేస్తూ వీడియోలో కాజల్ అగర్వాల్ కనిపించడంతో… ఆమెలో ఇంకా జోరు తగ్గలేదని అవకాశాలు మెండుగా వస్తాయని కామెంట్లు పెడుతున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !