భారతదేశంలోని ప్రముఖ ఆర్గనైజ్డ్ హోల్‌సేలర్, ఫుడ్ స్పెషలిస్ట్ అయిన మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఇండియాతో కలిసి కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ నేడిక్కడ కొత్త కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్- ‘మెట్రో కోటక్ క్రెడిట్ కార్డ్’ ను ఆవిష్కరించింది. ఈ కార్డ్ 3 మిలియన్లకు పైగా నమోదిత మెట్రో ఇండియా కస్టమర్లకు 48 రోజుల వరకు సులభమైన, వడ్డీ రహిత క్రెడిట్ సదుపాయాన్ని అందిస్తుంది. ఈ కార్డ్ రూపే నెట్‌వర్క్ లో ప్రారంభించబడింది. మెట్రో కస్టమర్ బేస్‌లో చిన్న వ్యాపారులు, కిరాణా యజమానులు, ఎంఎస్ఎంఈలు, చిన్న రెస్టారెంట్లు, HoRe Ca (హోటల్‌లు, రెస్టారెంట్లు మరియు క్యాటరర్స్), కార్యాలయాలు, కంపెనీలు, సంస్థలు, అలాగే స్వయం ఉపాధి నిపుణులు ఉన్నారు. కొత్త మెట్రో కోటక్ క్రెడిట్ కార్డ్ ను భారతదేశంలోని 21 నగరాల్లో ఉన్న 31 హోల్‌సేల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ల (స్టోర్‌లు) మెట్రో నెట్‌వర్క్‌లో, అలాగే మెట్రో హోల్‌సేల్ యాప్-ఇకామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో ఉపయోగించవచ్చు. విశిష్టతలు మరియు ప్రయోజనాలు: మెట్రో నుండి తమ రిటైల్ దుకాణాలలో నిల్వ చేయడానికి పెద్దమొత్తంలో కొనుగోలు చేసే రిటైలర్ల క్రెడిట్ అవసరాలను తీర్చడానికి మెట్రో కోటక్ క్రెడిట్ కార్డ్ రూపొందించబడింది. బి2బి విభాగంలో ఆకర్షణీయమైన క్రెడిట్ సదుపాయం – మెట్రో వ్యాపార కస్టమర్లకు 48 రోజుల వరకు వడ్డీ రహిత క్రెడిట్ క్రెడిట్ పరిమితి పరిధి- రూ. 25,000 నుండి మెట్రోతో కస్టమర్ కొనుగోలు నమూనా ఆధారంగా గరిష్ట క్రెడిట్ వరకు నగదు లేదా ఆన్‌లైన్ బదిలీ ద్వారా సౌకర్యవంతమైన రీపేమెంట్ ఎంపికలు కార్డ్ వినియోగదారులు మెట్రోలో వారి నెలవారీ ఖర్చులకు లోబడి, నెలకు రూ. 10,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. బ్యాంకు ఖాతా లేని మెట్రో వ్యాపార కస్టమర్లు కూడా కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు