సినిమా ఇండస్ట్రీలో చాలా జరుగుతుంటాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ముఖ్యంగా కాస్టింగ్ కౌచ్ మీద ఎక్కువగా చర్చ జరుగుతూ ఉంటుంది. అయితే.. కమిట్ మెంట్ విషయంలోనూ ఎక్కువగా చర్చ వస్తుంది. కొందరు దాన్ని కాస్టింగ్ కౌచ్ అంటే మరికొందరు దాన్ని కమిట్ మెంట్ అంటారు. హీరోలకు, దర్శకనిర్మాతలకు కొందరు హీరోయిన్లు కమిట్ మెంట్స్ ఇస్తుంటారు. దానికి ప్రతిఫలంగా వాళ్లకు ఎక్కువగా అవకాశాలు ఇప్పిస్తుంటారు. అయితే.. తాజాగా బాలీవుడ్ నటి తాప్సీ పన్ను అలాంటి వ్యాఖ్యలే బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి చేసి అందరినీ షాక్ కు గురి చేసింది. చాలామంది కెమెరా ముందు నటించడం ఒకలా ఉంటుంది.. కెమెరా వెనుక నటించడం ఇంకోలా ఉంటుంది. అది అందరికీ తెలిసిందే. కెమెరా ముందు కనిపించినంత మాత్రాన.. వాళ్లు మంచి వాళ్లు అని అనుకోలేం.. తెర వెనుక ఏం జరుగుతుందో చాలామందికి తెలియదు
.అయితే.. తాప్సీ ముక్కుసూటిగా మాట్లాడే హీరోయిన్. తను మనసులో ఏం దాచుకోదు. Taapsee Pannu comments about bollywood industry Taapsee Pannu : ముక్కుసూటిగా మాట్లాడి లేనిపోని చిక్కులు తెచ్చుకునే తాప్సీ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతుంది. అదే తనకు చాలా ఇబ్బందులను తీసుకొచ్చింది. అయితే.. తాజాగా బాలీవుడ్ లో తెర వెనుక ఏం జరుగుతోందో చెప్పుకొచ్చింది తాప్సీ. నేను అయితే కెమెరాలో మాత్రమే నటించగలను కానీ.. తెర వెనుక నటించడం నా వల్ల కాదు. నాకు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే అలవాటు. అయితే.. వెనుక నటించేవాళ్లే ఇండస్ట్రీలో ముందు వరుసలో ఉంటారు. వాళ్లకే అవకాశాలు ఎక్కువగా వస్తాయి. తెర వెనుక నటించే వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అంటూ ఇటీవల వైరల్ అవుతున్న ఓ స్టార్ హీరోయిన్ విషయాన్నే ఇన్ డైరెక్ట్ గా తాప్సీ చెప్పిందా అంటూ బాలీవుడ్ చెవులు కొరుక్కుంటోంది.