పొలిటికల్ ఫేమ్ కూడా ఉన్న స్టార్ హీరోల్లో ఎన్టీఆర్ ఒకరు. మాజీ సీఎం ఎన్టీఆర్ మనవడిగా ఆయన టీడీపీ అధినేత కావాలని కోరుకునే అభిమానులు ఎందరో ఉన్నారు. ఆల్రెడీ ఎన్టీఆర్ టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్టీఆర్ పెద్ద ఎత్తున పొలిటికల్ క్యాంపైన్ చేశారు. తాతను గుర్తు చేసేలా ఖాకీ రంగు దుస్తుల్లో ప్రచార రథం పై నిల్చొని ఉత్తేజ పూరిత ప్రసంగాలు ఇచ్చారు. ఎన్టీఆర్ వాక్పటిమ చూసి ఈయన రాజకీయాల్లో కూడా రాణిస్తాడని భావించారు. అయితే 2009 ఎన్నికలో టీడీపీ ఓటమి పాలైంది. టీడీపీ అధినేత చంద్రబాబుకు హరికృష్ణ కుటుంబానికి దూరం పెరిగింది. Taraka Ratna- NTR టీడీపీకి ఎన్టీఆర్ పూర్తిగా దూరమయ్యారు. రాజకీయాల జోలికి పోకుండా కెరీర్ పై ఫోకస్ పెట్టారు. అదే సమయంలో ఎన్టీఆర్ వలన వారసత్వ ప్రమాదం పొంచి ఉందని చంద్రబాబు ఆయన్ని దూరం పెట్టారనే వాదన ఉంది. నారా లోకేష్ కి టీడీపీ అధినాయకత్వం దక్కాలంటే ఎన్టీఆర్ వంటి ప్రతిభ ఉన్న లీడర్ టీడీపీలోకి రాకపోవడమే మంచిదని బాబు నమ్ముతున్నాడని మెజారిటీ వర్గాల అభిప్రాయం.
ఈ క్రమంలో బాబు జూనియర్ ఎన్టీఆర్ ని తొక్కేయాలని చూస్తున్నాడు అంటారు. మరోవైపు టీడీపీ కేడర్ లో ఎన్టీఆర్ వర్గం అనేది ఒకటి తయారైంది. సీనియర్ నాయకుడు బుచ్చయ్య చౌదరి కూడా ఎన్టీఆర్ వస్తేనే పార్టీ భవిష్యత్తు అన్నట్లు ఒకటి రెండు సందర్భాల్లో హింట్ ఇచ్చారు. 2019 ఓటమి తర్వాత బాబుకు ఎన్టీఆర్ సెగ ఎక్కువైంది. కష్టకాలంలో ఉన్న టీడీపీకి పూర్వ వైభవం ఎన్టీఆర్ తోనే వస్తుందని భావిస్తున్నారు కొందరు. టీడీపీ ఎన్టీఆర్, బాబు వర్గంగా చీలిపోయింది. భువనేశ్వరి పై వైసీపీ నాయకుల ఆరోపణలు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు సంఘటనలపై ఎన్టీఆర్ స్పందించిన తీరు సరిగా లేదని టీడీపీ నాయకులు తీవ్రస్థాయిలో ఏకిపారేశారు. అసలు ఎన్టీఆర్ నందమూరి వారసుడే కాదంటూ ధ్వజమెత్తారు. టీడీపీ కేడర్ లో ఎన్టీఆర్ కి ఉన్న ఇమేజ్ దెబ్బ తీసేందుకు బాబు వెనకుండి ఈ వ్యాఖ్యలు చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే టీడీపీలోని ఎన్టీఆర్ వర్గం, అభిమానులు ఆయనకు మద్దతుగా నిలిచారు. ఒక దశలో బాబు, ఎన్టీఆర్ వర్గాలుగా విడిపోయి సోషల్ మీడియా యుద్ధానికి దిగారు. బాబు బహిరంగ సభల్లో జై ఎన్టీఆర్ జెండాలు చూపుతూ ఫ్యాన్స్ నిరసనలు తెలియజేస్తున్నారు. ఎన్టీఆర్ రాజకీయ ముఖచిత్రం ఇలా ఉండగా… తారక్ కీలక వ్యాఖ్యలు చేశారు.