UPDATES  

NEWS

ఘనంగా కొండలక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు… భక్తులకు అన్నదానం చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు పట్ల నల్ల బ్యాడ్జిలతో నిరసన ర్యాలీ : ఏఐటియుసి పోరాట ఫలితమే 32శాతం లాభాలవాటా డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సారయ్య *హరిప్రియ ఫౌండేషన్ ఉచిత వైద్యశాల సేవలు అభినందనీయం మారుమూల గ్రామానికి కరెంటు లైన్ క్లియర్ మామిళ్ళవాయికి త్రీ పేజ్ విద్యుత్ లైన్ మంత్రి కేటీఆర్ మాటలు సరి కాదు తెదేపా ఇల్లందు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ మణుగూరు మున్సిపాలిటీ డ్రింకింగ్ వాటర్ కు 20 కోట్ల రూపాయల నిధుల మంజూరు పలు శుభకార్యాలకు హాజరైన రేగా సుధారాణి మణుగూరు సిఐ బాలాజీ వరప్రసాద్ ఆకస్మిక బదిలి

 చంద్రబాబుపై పోటీపై స్టార్ హీరో సంచలన నిర్ణయం

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సొంత నియోజవర్గం కావడంతో ఇప్పుడు అందరి ఫోకస్ దాని మీదే ఉంటోంది. వైసీపీ, టీడీపీ కుప్పంపై ప్రధాన దృష్టి సారించాయి. 2024 ఎన్నికల్లో ఇక్కడ నుంచి విజయం సాధించాలని పాచికలు వేస్తున్నాయి. ఇప్పటికే స్థానిక ఎన్నికల్లో టీడీపీని చావుదెబ్బ తీసిన వైసీపీ అదే ఊపుతో వచ్చే ఎన్నికల్లో కూడా అదే ఉత్సాహంతో టీడీపీని కుప్పంలో కనుమరుగు చేయాలని చూస్తోంది. ఇందులో భాగంగా చంద్రబాబును ఎదుర్కొనే వారి కోసం ఆరా తీస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ తమిళ హీరో విశాల్ ను ఇక్కడి నుంచి పోటీకి దింపుతారనే వార్తలు వస్తున్న సందర్భంలో విశాల్ వాటికి తెర దించాడు. వచ్చే ఎన్నికల్లో తాను కుప్పం నుంచి పోటీకి దిగుతున్నట్లు వస్తున్న వార్తలు ప్రచారంగానే కొట్టిపారేశారు. Vishal- Chandrababu గతంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో టీడీపీకి సీట్లు రాకుండా చేయడంలో వైసీపీ పైచేయి సాధించింది.

దీనిపై చంద్రబాబు నాయుడు స్పందిస్తూ తమ పార్టీని ఓడించేందుకు వైసీపీ విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేసిందని ఆరోపించారు. రాజకీయాల్లో ఇంతటి దుర్మార్గం ఉండదని అప్పట్లో నిప్పులు చెరిగారు. ప్రస్తుతం కూడా టీడీపీని ఓడించేందుకే వైసీపీ నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు కుప్పం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. కుప్పంలో విజయం సాధించాలని రెండు పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి. కుప్పంతో తన అనుబంధం గురించి విశాల్ వివరించారు. తన తండ్రి గ్రానైట్ కంపెనీలో పనిచేసేటప్పుడు మూడేళ్లు కుప్పంలో ఉన్నానని స్పష్టం చేశారు. అక్కడి ప్రజలతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు. రాజకీయాల్లోకి రావడం ఖాయమే కాని ఇప్పుడు కాదన్నారు. రాజకీయాల్లోకి వచ్చి సమాజ సేవ చేస్తానని వెల్లడించారు. దానికి ఇంకా సమయం ఉందని తేల్చారు. తాను కుప్పం నుంచి పోటీ చేస్తానని వస్తున్న వార్తలను ఖండించారు. వైసీపీ అభ్యర్థిగా భరత్ ఉంటారని ఇదివరకే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించడంతో ఆయన అభ్యర్థిత్వమే ఫైనల్ అని చెబుతున్నారు. కుప్పంలో చంద్రబాబుపై విశాల్ పోటీ చేస్తారని కొద్ది కాలంగా వార్తలు వస్తున్నా అందులో వాస్తవం లేదని తేలడంతో విశాల్ నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. విశాల్ ఎందుకు పోటీకి నిరాకరించాడనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ నేతలు విశాల్ ను పోటీకి ఒప్పించారనే వార్తలు జోరుగా వచ్చినా అవి వట్టివేనని తేలిపోవడం గమనార్హం.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !