UPDATES  

 వైసీపీపై ఆరోపణలు తీవ్రతరం

ఏపీలో గత కొద్దిరోజులుగా జరుగుతున్నమూడు ముక్కలాటకు తెరపడినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెవలనివ్వనని చెప్పడంతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని పవన్ ప్రకటించారు. గత ఎన్నికల్లో టీడీపీతో కలిసి జనసేన పోటీచేసి ఉంటే వైసీపీ పవర్ లోకి వచ్చి ఉండేదా? అని ప్రశ్నించడం ద్వారా పరోక్షంగా పొత్తులు ఖాయమని పవన్ సంకేతాలిచ్చారు. సత్తెనపల్లిలోని కౌలుభరోసా రైతు యాత్రలో భాగంగా ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.అయితే గతంలో కూడా పవన్ ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. కానీ ఇప్పుడు ఎన్నికలు మరింత సమీపిస్తున్న కొలదీ వైసీపీపై ఆరోపణలు తీవ్రతరం చేయడంతో పాటు వైసీపీ విముక్త ఏపీకి ఆయన గట్టి ప్రయత్నాలే ప్రారంభించారు. వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబుకే పొత్తులు కీలకం. జగన్ ఇప్పుడు ఆయనకు బలమైన ప్రత్యర్థి. టీడీపీకి క్షేత్రస్థాయిలో బలమున్న జగన్ ను ఢీకొట్టి ముందుకెళ్లే సాహసంచేయడం లేదు. అందుకే జనసేన చేయి కలిపితే కానీ ఆయనకు ధైర్యంగా ముందడుగు వేయలేని పరిస్థితి. పైగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చేయి కలిపితే సునాయాసంగా జగన్ ను అధికారానికి దూరం చేయవచ్చని చంద్రబాబుకు తెలుసు. అందుకే జనసేన, బీజేపీలతో పొత్తు కోసం ఎక్కువగా ఆరాటపడుతోంది చంద్రబాబే.

Pawan Kalyan- chandrababu అయితే ఆది నుంచి పవన్ చంద్రబాబు విషయంలో సానుకూలంగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్టుగానే ఇరువురు నాయకుల ప్రకటనలు ఉండేవి. అయితే పవన్ విషయంలో ప్రభుత్వం దుందుడుకుగా వ్యవహరించిన సమయాల్లో చంద్రబాబు పోటీపడి మరీ సంఘీభావం తెలిపేవారు. అటు చంద్రబాబు కుటుంబంపై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు, ఆయన కన్నీరు పెట్టుకున్నప్పుడు పవన్ స్పందించిన సందర్భాలున్నాయి. అయితే మొన్నటికి మొన్న పవన్ విశాఖ పర్యటనను ప్రభుత్వం అడ్డుకుంది. ఆ సమయంలో మాత్రం చంద్రబాబు పవన్ వద్దకు వెళ్లి మరీ మద్దతు ప్రకటించారు. కలిసి పనిచేస్తామని ప్రకటించారు. అయితే రాజకీయంగా కాకుండా.. కేవలం వైసీపీ ప్రభుతంపైనే అనిఅర్థం వచ్చేలా మాట్లాడారు. అప్పట్లో ఇరు పార్టీల మధ్య పొత్తు కుదిరిందని ప్రచారం జరిగినా.. పవన్ ప్రధానితో కలిసిన తరువాత సీన్ మారింది. నాకు ఒక చాన్స్ అని పవన్.. తనకు చివరి చాన్స్ అని చంద్రబాబు విన్నివించేసరికి పొత్తు ఉంటుందా? లేదా అన్న టాక్ ప్రారంభమైంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !